Coral Reef: సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో పగడపు దిబ్బల శిలాజాలు.. ఎక్కడో తెలుసా?

పగడపు దిబ్బలు భూమి వాతావరణ చరిత్రపై స్పష్టమైన డేటాను ఇవ్వగలవు. లడఖ్‌లో తాజాగా పగడపు దిబ్బల శిలాజాలను కనుగొన్నారు. లడఖ్ తూర్పు హిమాలయాల్లో సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో ఈ శిలాజాలు బయటపడ్డాయి. దీని గురించి మరింత సమాచారం కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్‌ చేయండి.

New Update
Coral Reef: సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో పగడపు దిబ్బల శిలాజాలు.. ఎక్కడో తెలుసా?

పగడపు దిబ్బలు.. వేల ఏళ్ల క్రితం నాటి రహస్యాలకు సాక్ష్యం. పగడపు దిబ్బల(Coral Reef) శిలాజాలతో ఎన్నో విషయాలను కనుగొన్నారు సైంటిస్టులు. చరిత్ర లోతులను తెలుసుకోవాలంటే సముద్రపు లోతులను అన్వేషించాల్సిందే. పురాతన భౌగోళిక అంశాలను వెలికితియ్యాలంటే పగడపు దిబ్బలపై పరిశోధనలు చేయ్యాల్సిందే. అప్పుడప్పుడు వింటుంటాం.. అక్కడ పగడపు దిబ్బలు కనిపించాయని.. ఇక్కడ కనిపించాయని వార్తల్లో వస్తుంటే చూస్తుంటాం. మన దేశంలోని అందమైన ప్రదేశాల్లో లడఖ్‌ ఒకటి. అలాంటి అందమైన ప్రాంతంలో సుందరమైన పగడపు దిబ్బల శిలాజాలు లభ్యమయ్యాయి.

publive-image ప్రతీకాత్మక చిత్రం

18 వేల అడుగుల ఎత్తులో... :
లడఖ్‌లో కోరల్ రీఫ్ శిలాజాలను కనుగొన్నారు. లడఖ్ తూర్పు హిమాలయాల్లో సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో ఈ శిలాజాలు బయటపడ్డాయి. నిజానికి లడఖ్ ఎత్తైన ఎడారులు, పచ్చిక బయళ్లకు ప్రసిద్ధి. అయితే ఈ శిలాజాలను చూస్తే లడఖ్‌ ఒకప్పుడు భిన్నమైన భౌగోళిక ల్యాండ్‌గా ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో గత భౌగోళిక పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ ఆవిష్కరణ ఉపయోగపతుంది. రితేష్ ఆర్య అనే భూవిజ్ఞాన శాస్త్రవేత్త పగడపు దిబ్బల ప్రాముఖ్యతను వివరించారు. అవి అందమైన భౌగోళిక నిర్మాణాలు మాత్రమే కాదని.. గత వాతావరణాల రికార్డులను కూడా నిల్వ చేస్తాయన్నారు రితేష్‌. ఇందులో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, సముద్ర మట్ట హెచ్చుతగ్గులపై డేటా ఉంటుందని స్ఫస్టం చేవారు. అక్టోబర్ 19(నిన్న)న జరుపుకునే ప్రపంచ శిలాజ దినోత్సవం సందర్భంగా ఆర్య ఈ ఆవిష్కరణను హైలైట్ చేశారు. లడఖ్‌లోని ఈ పగడపు దిబ్బల శిలాజాలను అండమాన్ పగడాలతో పోల్చేలా ఉందని సైంటిస్టులు అంటున్నారు.

పగడపు దిబ్బలు గురించి:
పగడాలు మహాసముద్రాలలో కనిపిస్తాయి. అయితే అతిపెద్ద పగడపు దిబ్బలు ఎక్కువగా ఉష్ణమండల, నిస్సారమైన నీటిలో కనిపిస్తాయి. ఈ పగడపు దిబ్బలలో అతిపెద్దది ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్. ఈ అతిపెద్ద పగడపు దిబ్బ 1,500 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. ఇవి అనేక సముద్ర జీవులకు ఆవాసాలు, ఆశ్రయాన్ని అందిస్తాయి. ఇవి కార్బన్, నైట్రోజన్ ఫిక్సింగ్‌కు సహాయపడతాయి. ఈ పగడపు దిబ్బలు మన ఏపీవైపు ఎక్కువగా కనిపించవు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో గంగానది, మరికొన్ని నదుల నుంచి మంచినీటిని విడుదల చేస్తారు. ఈ కారణంగా పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్న ప్రాంతాల్లో పగడపు దిబ్బలు కనిపించవు. తమిళనాడు నుంచి తూర్పు తీరం, దక్షిణ చివర వరకు పగడపు దిబ్బలు మంచినీరు లేకపోవడం వల్ల ఉన్నాయి. ఎందుకంటే పగడాలు ప్రత్యేకంగా సముద్ర ఆవాసాలలో కనిపిస్తాయి. అధిక ఉప్పు సాంద్రత ఉండడం పగడాల పెరుగుదలకు అవసరమైన పరిస్థితి.

Also Read: అబ్బాయిలూ…ఇలాంటి గుణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఉండరు..!!

Advertisment
తాజా కథనాలు