India WC Squad: టీమిండియా వరల్డ్‌కప్ తుది జట్టు ఖరారు!

మరో నెలలో ప్రారంభంకానున్న క్రికెట్ వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత్ జట్టును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను సెలెక్టర్లు ఎంపిక చేసినట్లు  ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక తెలిపింది. ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న 18 మంది సభ్యుల్లో నుంచి ఈ 15 మందిని జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొంది.

India WC Squad: టీమిండియా వరల్డ్‌కప్ తుది జట్టు ఖరారు!
New Update

India WC Squad: మరో నెలలో ప్రారంభంకానున్న క్రికెట్ వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత్ జట్టును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను సెలెక్టర్లు ఎంపిక చేసినట్లు  ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక తెలిపింది. ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న 18 మంది సభ్యుల్లో నుంచి ఈ 15 మందిని జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొంది. సంజూ శాంసన్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ, స్పిన్నర్ ప్రసిద్ధ్ కృష్ణలకు చోటు కల్పించలేదని వెల్లడించింది. ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచులకు దూరమైన కేఎల్ రాహుల్‌ టీం ప్లేస్ కన్మార్మ్ చేసుకున్నాడంది.

వరల్డ్‌కప్ జట్టు సెలెక్షన్ కోసం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ శ్రీలంక వెళ్లాడని తెలిపింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో భేటీ అయి జట్టు కూర్పుపై చర్చించినట్లు పేర్కొంది. ఐసీసీ నిబంధనల ప్రకారం వరల్డ్ కప్ ఆడబోయే జట్లు సెప్టెంబర్ 5 కల్లా 15 మందితో కూడిన జట్టును ప్రకటించాలి. తర్వాత ఏమైనా మార్పులు ఉంటే టెక్నికల్ కమిటీ అనుమతి తీసుకుని మార్చుకునే అవకాశం ఉంటుంది. దీంతో భారత్ తుది జట్టు ఎంపిక కోసం కసరత్తు ముమ్మరం చేశారని వెల్లడించింది.

ఎన్ని అవకాశాలు ఇచ్చినా వినియోగించుకోని శాంసన్‌ను పక్కన పెట్టనున్నారు. అలాగే యువ ఆటగాళ్లైనా తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణలకు స్థానం కల్పించలేదు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు బ్యాకప్‌ ప్లేయర్లగా తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇక మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న కేఎల్ రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. రాహుల్‌ ఫిట్‌నెస్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బీసీసీఐ.. జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే సెప్టెంబర్ 4నే భారత జట్టును ప్రకటించనున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

publive-image

జట్టు కూర్పును ఓసారి పరిశీలిస్తే.. బ్యాటర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ సేవలు అందించనున్నారు. ఆల్ రౌండర్లుగా హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ ఉండనున్నారు. ఇక పేసర్లుగా జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు.

వరల్డ్ కప్‌కు భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe