ఆహార భద్రతకు భారత్ పరిష్కారం కనుగొంటుంది: ప్రధాని మోదీ

ప్రపంచ ఆహార భద్రత, పోషకాహార లోపం సమస్యకు భారత్ పరిష్కారం కనుగొంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ సైన్సెస్,32వ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిస్ట్ ఫంక్షన్‌ను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.

ఆహార భద్రతకు భారత్ పరిష్కారం కనుగొంటుంది: ప్రధాని మోదీ
New Update

నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ సైన్సెస్,32వ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిస్ట్ ఫంక్షన్‌ను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. భారతదేశంలో 15 వ్యవసాయ వాతావరణాలు, వివిధ వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి. ఈ వైవిధ్యమే భారతదేశాన్ని ప్రపంచ ఆహార భద్రతకు ఆశాజ్యోతిగా మారుస్తుంది. పాలు,పప్పుధాన్యాల అధిక ఉత్పత్తి కారణంగా భారతదేశం ఆహార మిగులు దేశంగా ఉంది. భారతదేశ ఆహార భద్రత ఒకప్పుడు అంతర్జాతీయ ఆందోళనగా ఉండేది. నేడు భారతదేశం ప్రపంచ ఆహార భద్రత,పోషకాహార లోపానికి ఒక పరిష్కారాన్ని కనుగొంది.

ఆహారం,వ్యవసాయంలో మన సంప్రదాయం అనుభవం పురాతన కాలం నాటిది. వ్యవసాయ సంప్రదాయంలో సైన్స్‌కు ప్రాధాన్యత ఉంది. ఆహారాన్ని ఔషధంగా పరిగణించే ఆయుర్వేద శాస్త్రం మనకు ఉంది. చిరు ధాన్యాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ప్రపంచ పోషకాహార సమస్యకు చిరు ధాన్యాలే సమాధానమని మోదీ అన్నారు.

#pm-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe