Delhi: పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేస్తున్న అఖిల పక్ష భారత ఎంపీలు!

కేంద్ర బడ్జెట్ వివక్షపూరితంగా ఉందని పార్లమెంట్ ప్రవేశ ద్వారం వద్ద అఖిల భారత ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తున్నారని,ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని' బ్యానర్లతో నిరసన తెలిపారు.

Delhi: పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేస్తున్న అఖిల పక్ష భారత ఎంపీలు!
New Update

INDIA Bloc Protest: కేంద్ర బడ్జెట్ వివక్షపూరితంగా ఉందని పార్లమెంట్ ప్రవేశ ద్వారం వద్ద అఖిల భారత ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో (Union Budget 2024) బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తున్నారని,ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని' బ్యానర్లతో నిరసన తెలిపారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) నిన్న పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు NDA కూటమిలో అధికారం చేపట్టడంలో కీలకంగా వ్యవహరించాయి.దీంతో ఇరు రాష్ట్రాలకు కేంద్రం వరాల జల్లు కురిపించిందని ఆయా రాష్ట్రాలు నిన్న గళమెత్తాయి.దీంతో సాయంత్రం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగింది. బడ్జెట్‌పై నిరసన తెలపాలని సమావేశంలో ఎంపీలు నిర్ణయించారు.దీంతో నేడు ప్రవేశ ద్వారం ఎదుట అఖిలపక్షం ఎంపీలు 'బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తున్నారని, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని' బ్యానర్లతో నిరసన తెలిపారు.

Also Read: ఢిల్లీలో కీలక పరిణామం.. జగన్ కు మద్దతు తెలిపిన అఖిలేష్ యాదవ్..!

#union-budget-2024 #nirmala-sitharaman #india-alliance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి