భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ షెడ్యూల్ మారింది. ఎందుకంటే అక్టోబర్ 15 అంటే దేవి నవరాత్రులకు మొదటి రోజు.ఆ పండుగను ఎంతో గొప్పగా జరుపుకునే అహ్మదాబాద్ లో ఈ మ్యాచ్‌ని నిర్వహిస్తుండటంతో భద్రతాపరమైన సమస్యలు కూడా చోటు చేసుకుంటాయని కొన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు బీసీసీఐకి సూచించినట్లు సమాచారం.
దీని గురించి బీసీసీఐ కూడా స్పందించింది. అందుకే ఆ మ్యాచ్ తేదీ మార్పు అంశం గురించి పరిశీలించే విధంగా ఉన్నట్లు బీసీసీఐ అధికారి కూడా ఒకరు వివరించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దేవినవరాత్రులు మొదటి రోజున మ్యాచ్ జరిగితే కనుక ఫ్యాన్స్ కి సెక్యూరిటీ రూల్స్ వల్ల ఫ్యాన్స్ ఇబ్బందులకు గురవుతారని సమాచారం.
షెడ్యూల్ ప్రకారం భారత్ పాక్ మ్యాచ్ జరగకపోతే కనుక ముందుగా టికెట్లు కొనుగోలు చేసిన వారితో పాటు అహ్మదాబాద్ లో ముందుగా హోటల్స్ బుక్ చేసుకున్న వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడతారని తెలుస్తోంది.
భారత్‌లోని 10 నగరాల్లో ప్రపంచకప్‌ను నిర్వహించనున్నారు. మరోవైపు ప్రపంచకప్‌ను నిర్వహించే అన్ని క్రికెట్ సంఘాలకు బీసీసీఐ సెక్రటరీ జై షా లేఖ రాస్తూ జులై 27న ఢిల్లీలో సమావేశానికి పిలుపునిచ్చాడు. ఈ భేటీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై చర్చ జరుగుతుందని, ఈ హై ప్రొఫైల్ మ్యాచ్ కొత్త తేదీని కూడా నిర్ణయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.