IND Vs ENG: అదే వ్యూహంతో రోహిత్ ను కట్టడిచేస్తాం.. మార్క్ వుడ్

భారత సారథి రోహిత్ శర్మను బోల్తా కొట్టించేందుకు తమ దగ్గర పక్కా వ్యూహాం ఉందని ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ అన్నారు. 'రోహిత్ సామర్థ్యాన్ని ఎదుర్కోవడానికి బౌలర్లకు షార్ట్ పిచ్ డెలివరీలు సహాయపడతాయి. భారత్ పై ఒత్తిడి పెంచేందుకు మా దూకుడు కొనసాగిస్తాం' అని అన్నాడు.

New Update
IND Vs ENG: అదే వ్యూహంతో రోహిత్ ను కట్టడిచేస్తాం.. మార్క్ వుడ్

IND Vs ENG: భారత్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత సారథి రోహిత్ శర్మను (Rohit Sharma) బోల్తా కొట్టించేందుకు తమ దగ్గర పక్కా వ్యూహాలు ఉన్నాయని ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ (Mark wood) అన్నారు. జనవరి 25నుంచి మొదటి టెస్టు మొదలవనుండగా ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టేశాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన మార్క్ వుడ్.. రోహిత్ శర్మ ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంటుందని, అయితే అతన్ని కట్టడి చేసేందుకు తమ జట్టు అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని చెప్పాడు.

షార్ట్ పిచ్ డెలివరీలు..
భారత పిచ్‌లు స్పిన్ తోపాటు స్వింగ్ అండ్ పేస్ కు కూడా అనుకూలిస్తాయి. అయితే భారత బ్యాటర్లను ముఖ్యంగా రోహిత్ శర్మ సామర్థ్యాన్ని బౌలర్లు ఎదుర్కోవడానికి షార్ట్ పిచ్ డెలివరీలు సహాయపడతాయని అభిప్రాయపడ్డాడు. 'పిచ్ కొన్నిసార్లు రెండు వైపులా సహకరిస్తుంది. అది నెమ్మదిగా ఉంటే కొన్నిసార్లు బౌలర్లకు సహాయపడుతుంది. రోహిత్ లాంటి వ్యక్తి షార్ట్ బాల్స్ చక్కగా ఆడుతాడు. అలాంటపుడు అతనికి బౌన్సర్‌ వేయలనుకుంటారు. కానీ నేను మాత్రం సరైన సమయంలో షార్ట్ పిచ్ డెలివరీలను వేయాలనుకుంటున్నా' అని చెప్పాడు.

ఇది కూడా చదవండి : Cook: అదే మా కొంపముంచేలా ఉంది.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

దూకుడు కొనసాగిస్తాం..
ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes), కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నేతృత్వంలో తమ జట్టు దూకుడు ఆట శైలిని అవలంబించిందన్నాడు. 'మేము ఇంకా అదే ఆటను కొనసాగించాలని అనుకుంటున్నాం. కొన్ని సమయాల్లో అది తెలివిగా ఉంటుందని నేను భావిస్తున్నా. భారత్ పై ఒత్తిడి పెంచేందుకు మా దూకుడు చాలా అవసరం' అని వుడ్ పేర్కొన్నాడు. అలాగే భారత్‌లో (India) చరిత్ర సృష్టించాలనే తపనతో ఇంగ్లండ్‌కు (England) ఒత్తిడికి లోనయ్యే అవకాశం కూడా ఉంటుందన్నాడు. 'ఇక్కడ ఉన్న సవాళ్ల గురించి మాకు తెలుసు. భారత్ స్వదేశంలో చాలా అరుదుగా ఓడిపోతుంది. ఇది దాదాపు మాకు కొంత ఫ్రీ హిట్ లాంటిదని నేను భావిస్తున్నా. మేము ఆటను మరింత విభిన్నంగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇటీవల పాకిస్థాన్‌లో చరిత్ర సృష్టించి మొదటి స్థానంలో నిలిచాం. ప్రతి మ్యాచ్‌ని గెలవడానికి మా జట్టు ప్రయత్నిస్తోంది' అన్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు