భర్త చనిపోయి 10ఏళ్లు దాటింది.. ముగ్గురు పిల్లలు.. అందులో ఇద్దరు ఆడపిల్లలు.. నెల క్రితమే పెద్ద కూతురికి పెళ్లి సంబంధం కుదిరింది. ఈ నెల 6న ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ నెల 30న పెళ్లి.. బంధువులు వద్ద డబ్బులు తీసుకోని ఇంటికి వెళ్తుంది. అప్పటికీ అర్థరాత్రి అవుతుంది. ఆటో కోసం ఎదురు చూస్తోంది. ఇంతలోనే పోలీసులు పెట్రోలింగ్ పేరుతో ఆమె వద్దకు వచ్చారు. బాధితురాలను అవమానించేలాగా మాట్లాడారు. కారణం చెప్పకుండా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కి పట్టుకుపోయారు. చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. చావబాదారు.. నోట్లో క్లాత్ పెట్టి బయటకు అరుపులు రాకుండా కొట్టారు. మహిళ అని కూడా చూడకుండా ఎక్కడపడితే అక్కడ తన్నారు. గోడకు అటువైపు ఇటువైపు తోస్తు మనుషులుమన్న విచక్షణ మరిచి ప్రవర్తించారు.
ఇంతలా హింసిస్తారా?
తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. కొట్టవద్దని.. ఆ మహిళా కాళ్లు పట్టుకుంది.. వేడుకుంది.. అయినా కనికరించలేదు ఖాకీలు. రాత్రంతా చావబాది.. ఉదయాన్ని బంధువులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో బాధిత మహిళకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. పోలీసులు కొట్టిన తర్వాత ఆ మహిళ శరీరం గ్రీన్‌గా మారిపోయిందంటే ఖాకీల క్రూరత్వం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. సమాజాన్ని కాపాడాల్సిన పోలీసులే.. అందులో ఓ గిరిజన మహిళపై..అది కూడా అర్థరాత్రి పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లడం ఏంటి? అక్కడ చావబాదడం ఏంటి? అసలు ఏం తప్పు చేసిందని కొట్టారు? మహిళ చేతిలో ఉండాల్సిన డబ్బులు ఏమయ్యాయి..? ఇప్పుడివే ప్రశ్నలను సంధిస్తున్నారు ఆమె బంధువులు.
హృదయాల్ని మెలిపెడుతున్న థర్డ్ డిగ్రీ బాధితురాలి కథ..ఇంతలా హింసిస్తారా?
గిరిజన మహిళను అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి భౌతిక దాడి చేసిన ఘటనపై అన్నివైపుల నుంచి విమర్శలు పెరిగిపోతున్నాయి. నగర నడిఒడ్డున మహిళకే రక్షణ కరువైందని బీఆర్ఎస్ టార్గెట్‌గా ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర మహిళా కమిషన్ ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే రఘునందన్.
Translate this News: