Health Tips: ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఈ టిప్స్ పాటించి చూడండి..! వింటర్ సీజన్ లో కొంత మంది నిమోనియా వంటి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. నిమోనియా తో బాధపడే వాళ్ళు పొగ తాగడం, కలుషితమైన ప్రదేశాల్లో తిరగడం మానేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం, ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్ని పెంచే వ్యాయామాలు ఎక్కువగా చేయాలని నిపుణులు చెబుతున్నారు. By Archana 14 Nov 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి చలి కాలంలో వాతావరణంలో మార్పుల వల్ల చాలా మందిలో జలుబు, జ్వరం, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ వింటర్ సీజన్ లో కొంత మందికి నిమోనియా సమస్య ఎక్కువవుతుంది. ఈ సమస్యను తగ్గించి.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. పొగ తాగడం మానేయాలి నిమోనియా సమస్య ఉన్నవాళ్లు పొగతాగడం మానేయాలి. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పొగతాగడం వల్ల ఊపిరితిత్తులు కణజాలం దెబ్బతిని.. నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ త్వరగా వచ్చే ప్రమాదం ఉంటుంది. పొగ తాగే వారికి దూరంగా ఉండాలి పొగ తాగడమే కాదు ఎదుటి వారు పొగ తాగేటప్పుడు ఆ పొగను పీల్చిన ఊపిరితిత్తులకు హానికరం. అందుకని పొగ తాగే వాతావరణానికి దూరంగా ఉండి.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వ్యాక్సినేషన్ చేయించుకోవాలి నిమోనియా రాకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. వ్యాక్సినేషన్ చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి.. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ తో పోరాడి నిమోనియా వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కలుషిత ప్రదేశాలకు దూరంగా ఉండాలి కలుషితమైన గాలిని పీల్చడం వల్ల వాటిలోని కెమికల్స్, విషవాయువులు ఊపిరితిత్తుల ఆరోగ్యం పై ప్రభావం చూపును. దాని వల్ల నిమోనియా వంటి శ్వాస సమస్యలు ఎక్కువవుతాయి. స్వచ్ఛమైన గాలి కోసం ప్యురీ ఫైయర్స్, సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. వ్యాయామాలు ఊపిరితత్తులకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. దాని వల్ల ఊపిరితిత్తుల కండరాళ్లు దృఢంగా మారి.. ఊపిరితిత్తుల పని తీరు కూడా మెరుగుపడుతుంది. ఇలా చేస్తే శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించును. ఆరోగ్యకరమైన ఆహారం ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వాటిలో ని పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఇన్ఫెక్షన్స్ దూరం చేయడంతో పాటు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచును. Also Read: నిద్రపోయే ముందు వాటర్ తాగుతున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి