IVF Center : రాష్ట్రంలో మొదటిసారిగా ఐవీఎఫ్ కేంద్రం.. గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించిన హోంమంత్రి..!!

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. ఈ ఐవీఎఫ్ సెంటర్ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ ఐవీఎఫ్ కేంద్రం పేదలకు వరం లాంటిదని హోంమంత్రి అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల విలువ చేసే సంతాన సాఫల్య వైద్యం గాంధీ ఆసుపత్రిలోనే పేదలకు ఉచితంగా అందించడం హర్షణీయమన్నారు.

IVF Center : రాష్ట్రంలో మొదటిసారిగా ఐవీఎఫ్ కేంద్రం.. గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించిన హోంమంత్రి..!!
New Update

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. ఈ ఐవీఎఫ్ సెంటర్ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ ఐవీఎఫ్ కేంద్రం పేదలకు వరం లాంటిదని హోంమంత్రి అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల విలువ చేసే సంతాన సాఫల్య వైద్యం గాంధీ ఆసుపత్రిలోనే పేదలకు ఉచితంగా అందించడం హర్షణీయమన్నారు.

సంతానం లేక ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది దంపతుల కోసం రాష్ట్రంలోనే తొలిసారి ఐవీఎఫ్ సెంటర్ ను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని ఐదవ అంతస్తులో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: నేడే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్.. ఈసీ అధికారిక ప్రకటన!

ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడారు. గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ సెంటర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉ:దన్నారు. పేట్లబూర్జ, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రుల్లో కూడా ఐవీఎఫ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువస్తామని హోంమంత్రి తెలిపారు. ఈ సెంటర్ల ద్వారా ఖరీదైన ట్రీట్ మెంట్ ను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: కానిస్టేబుల్ ఉద్యోగం పొందిన అభ్యర్థులకు అలర్ట్.. ట్రైనింగ్ మరింత ఆలస్యం?

రూ. 5కోట్లతో గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావు అన్నారు. 2018 నుంచి గాంధీలో ఐయూఐ విధానం ద్వారా సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 2వంందల మంది మహిళలకు సంతానం కలిగిందన్నారు. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవతో ఐవీఎఫ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామం అని గైనిక్ ప్రొఫెసర్ వెల్లంకి జానకీ తెలిపారు.

గౌరవనీయులైన సీఎం కేసీఆర్ గారి దార్శనిక నాయకత్వానికి ధన్యవాదాలు. ఖరీదైన IVF చికిత్సలు ఇప్పుడు ఉచితంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. యావత్ జాతికి ఆదర్శంగా నిలుస్తూ తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతోందని మంత్రి హారీశ్ రావు ట్వీట్ చేశారు.

#ivf-center #gandhi-hospital
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి