పాకిస్తాన్ లో 24గంటల్లో రెండు హిందూ దేవాలయాలు ద్వంసం అయ్యాయి. 150ఏళ్ల క్రితం నిర్మించిన కరాచీలోని మారిమాతా ఆలయాన్ని దుండగులు కూల్చివేసిన ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. మరో హిందూదేవాలయాన్ని ధ్వంసం చేశారు దుండగులు. పాకిస్తాన్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లోని కాష్మోర్ ప్రాంతంలోని దేవాలయంపై రాకెట్లతో దాడికి పాల్పడ్డారు.
ఆదివారం తెల్లవారుజామున రాకెట్ లాంచర్లతో దాడి చేశారు. దాడి సమయంలో ఆలయాన్ని మూసివేశారు నిర్వాహకులు.అయితే ఈ ఘటనలకు పాకిస్తాన్ హెచ్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. సింధ్‌లోని కాష్మోర్ , ఘోట్కీ జిల్లాల్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, అక్కడ మహిళలు, పిల్లలతో సహా దాదాపు 30 మంది హిందూ సమాజంలోని సభ్యులు వ్యవస్థీకృత క్రిమినల్ ముఠాలచే బందీలుగా ఉన్నారని ఆరోపించిన నివేదికలపై పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మాత్రమే కాదు, ఈ ముఠాలు అత్యంత అధునాతన ఆయుధాలను ఉపయోగించి సమాజంలోని ప్రార్థనా స్థలాలపై దాడి చేస్తామని బెదిరించినట్లు కమీషన్‌కు కలవరపెట్టే నివేదికలు కూడా వచ్చాయి.
దీనిపై ఎలాంటి జాప్యం లేకుండా దర్యాప్తు చేయాలని సింధ్ హోం శాఖను కమిషన్ కోరింది. కరాచీలో చాలా పురాతన దేవాలయాలు ఉన్నాయని, పాకిస్తాన్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీ ఉంది. పాకిస్తాన్‌లో నివసిస్తున్న హిందూ జనాభాలో అత్యధికులు సింధ్ ప్రావిన్స్‌లో మాత్రమే నివసిస్తున్నారు.
150 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు:
పాకిస్థాన్‌లోని కరాచీలో దాదాపు 150 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. ఆలయ భూములపై ల్యాండ్ మాఫియా చాలా కాలంగా కన్నేసింది. ఈ కట్టడం పురాతనమైనది. ఆలయ భూమిని ఆక్రమించడానికి దాడి చేయడంతో స్థానిక హిందూ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కరాచీలోని సోల్జర్ బజార్‌లో ఉన్న మారి మాత ఆలయాన్ని శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. ఈ ఆలయం 400 నుండి 500 చదరపు గజాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కొన్నాళ్లుగా ఈ భూమిపై ల్యాండ్ మాఫియా, డెవలపర్ల కన్ను పడింది. ఈనేపథ్యంలో హిందూ దేవాలయాలపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది.