AP Elections: పిఠాపురంలో రోజుకో పంచాయితీ...మరోసారి రెచ్చిపోయిన కార్యకర్తలు!

పిఠాపురం నియోజకవర్గంలోని చెందుర్తి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోనికి ప్రచారం నిర్వహించేందుకు ఒకేసారి వైసీపీ, కూటమి నేతలు వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్దం జరిగింది. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుండడంతో ఇరువైపుల వారిని పోలీసులు ఆపేశారు.

AP Elections: పిఠాపురంలో రోజుకో పంచాయితీ...మరోసారి రెచ్చిపోయిన కార్యకర్తలు!
New Update

High Tension in Pithapuram: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ వాతావరణం రోజురోజుకి వేడెక్కుతుంది. ఏపీ రాజకీయ పార్టీలన్ని ఎక్కడ తగ్గేదేలే అన్నట్లు తమ ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల అభ్యర్థులు ఎండను సైతం లెక్క చేయకుండా గెలుపే లక్ష్యంగా తెగ తిరిగేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో హాట్‌ హాట్‌ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా పిఠాపురమనే చెప్పాలి.

ఎందుకంటే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో సినీ తారలంతా కదలి వచ్చి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఏపీ తో పాటు ఇతర రాష్ట్రాల చూపు కూడా పిఠాపురం మీద పడింది అంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం (Election Campaign) ఎంత జోరుగా సాగుతుందో ఘర్షణల హోరు కూడా అంతే జోరుగా సాగుతుంది.

పవన్‌ తరుఫున ప్రచారం నిర్వహించడానికి వచ్చిన పవన్‌ మేనల్లుడు , సినీ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) మీద గుర్తు తెలియని వ్యక్తులు కూల్‌ డ్రింక్‌ బాటిల్‌ విసరడంతో అది పక్కనే ఉన్న కార్యకర్తకు తగలడంతో అతనికి తీవ్ర గాయామైంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్యకర్తలు కావాలని రెచ్చగొడుతున్నారని జనసేన (Janasena) నేతలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే మరోసారి నియోజకవర్గంలోని చెందుర్తి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోనికి ప్రచారం నిర్వహించేందుకు ఒకేసారి వైసీపీ, కూటమి నేతలు వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్దం జరిగింది. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుండడంతో ఇరువైపుల వారిని పోలీసులు ఆపేశారు.

దీంతో కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రచారానికి అనుమతి ఇవ్వాలని పట్టు పట్టారు. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ...పిఠాపురంలో వాతావరణం టెన్షన్ గా మారిందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.

Also Read: సిక్‌ లీవ్ పెట్టిన సిబ్బంది..నిలిచిన 70 ఎయిర్‌ ఇండియా విమానాలు!

#janasena #pawan-kalyan #ap-elections-2024 #ycp #pithapuram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి