Ooru Peru Bhairavakona: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ కలిసి జంటగా నటించిన చిత్రం ఊరు పేరు భైరవకోన. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు వీఐ ఆనంద్ తెరకెక్కించారు. గత నెల ఫిబ్రవరి 16న థియేటర్స్ లో సందడి చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. మంచి వసూళ్లనే రాబట్టింది. మంచి మ్యూజికల్ హిట్ గా కూడా నిలిచింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
Also Read : Uday Kiran: ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్
ఊరు పేరు భైరవకోన ఓటీటీ రిలీజ్
అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. రిలీజై నెల రోజులు కాకముందే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఎలాంటి అప్డేట్ లేకుండా సైలెంట్ గా ఓటీటీలో విడుదలైంది. నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఆలస్యమెందుకు ఈ సినిమాను థియేటర్స్ లో మిస్సయిన వాళ్ళు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
ఊరు పేరు భైరవకోన స్టోరీ
భైరవకోన అనే ఊళ్ళో అడుగుపెట్టిన వాళ్ళు ఎవరూ ప్రాణాలతో బయట పడిన సందర్భాలు ఉండవు. అయితే ఒక దొంగతనం చేసి పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో సందీప్ కిషన్ (బసవ) అతడి స్నేహితులు భైరవకోన ఊళ్ళో అడుగుపెడతారు. దీంతో అక్కడ హీరోకు తన స్నేహితులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? సందీప్ కిషన్ దొంగగా ఎందుకు మారాడు..? గరుడ పురాణంలో మిస్సయిన నాలుగు పేజీలకు భైరవకోన గ్రామానికి సంబంధం ఏంటి అనేదే ఈ సినిమా కథ.
Also Read : Samantha: సమంతతో తిరుమలలో ప్రత్యక్షమైన ప్రీతం.. మరోసారి టాలీవుడ్ లో గుసగుసలు