దైనందిన జీవితంలో వాట్సాప్ మన జీవితాల్లోకి చొచ్చుకుపోతోంది. ఆఫీస్ పనికోసమో,స్కూల్ , కాలేజ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా ఒకటేమిటీ అన్నిట్లోను వాట్సాప్ అంతర్భాగం అయిపోయింది.
వాట్సాప్ లో చిన్న మెస్సేజ్ పెట్టి ఒక నొక్కు నొక్కితే చాలు గ్రూపులో ఎంత మంది ఉంటే అంతమందికీ టింగ్ మనే సౌండ్ తో క్షణాఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతోంది.ఆమేరకు మంచైనా చెడైనా గ్రూపందరికీ ఆ ఇన్ఫర్మేషన్ దావాలనంలా వ్యాపిస్తుంది.
ఆఫీస్ కి సంబంధించిన డైలీ అప్డేట్స్ , ఫ్యామిలీకైతే క్షేమ సమాచారాలు,లేదా స్పెషల్ అకేషన్ కి, సరదా సంభాషణలకు వాట్సాప్ వత్తాసు పలుకుతోంది. అయితే సైబర్ నేరగాళ్ల పుణ్యమా అని అడ్మిన్ కి ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ని నడిపించడం పెద్ద ఛాలెంజ్ గా మారింది.
ఎందుకంటే ఇందులో కూడా మేకవన్నె పులులు, కన్నింగ్ కంత్రీగాళ్లు ఉంటారుకదా.! ఇలాంటి వాళ్లతో తస్మాత్ జాగ్రత్తని వాట్సాప్ అడ్మిన్లను హెచ్చరిస్తున్నారు సైబర్ పోలీసులు.
తేడా వస్తే క్రిమినల్ అఫెన్స్ తో తాట తీస్తామంటున్నారు. జాతి,మత, కుల, భాష విద్వేషాలను రెచ్చగొట్టే ఎలాంటి కంటెంట్ ఉన్నా వదంతులను పనిగట్టుకుని విషప్రచారం చేసినా కేసుల వడ్డన తప్పదంటున్నారు.
ఇటీవల మత, జాతి, భాష కు సంబంధించిన అనవర,భయాలను కలిగించే ప్రచారాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో వీటికి చెక్ పెట్టడానికి సైబర్ పోలీస్ మూడోకన్ను తెరుస్తామంటున్నారు. గ్రూప్ లో ఎవరు ఎలాంటి విషప్రచార వాట్సాప్ అడ్మిన్ కే వాచిపోతుందని వార్నింగిస్తున్నారు.
అసత్య,అనవసర,వివక్ష,విద్వేష పూరిత పోస్ట్ లు పెట్టి..శాంతిభద్రతలకు భంగం కల్గిస్తే ఐపీసీ సెక్షన్ 153ఏ కింద కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుందని అడ్మిన్లను అలెర్ట్ చేస్తున్నారు. మణిపూర్ జాతి వివక్ష అల్లర్లు,భారీవర్షాలతో బాటు,
ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో పరిస్థితులు కంట్రోల్ తప్పకుండా..అల్లరి మూకలు చిల్లర వేషాలు వెయ్యకుండా ముందస్తు భద్రత విషయంలో గ్రూప్ అడ్మిన్లకు అవగాహన కల్పిస్తు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
అయితే ఇలాంటి వివక్ష విషప్రచారాన్ని నివారించడానికి సైబర్ పోలీస్ కొన్ని సూచనలు చేశారు. ప్రతి గ్రూప్ సభ్యులు విశ్వసనీయంగా ఉండేలా అడ్మిన్ చూడాలంటున్నారు,శాంతి భద్రతలుకు,దేశ సమగ్రతకు విఘాతం కలిగించే మెసేజ్ లు పెడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటున్నారు.
గ్రూప్‌లోని పోస్టింగ్ నియమాల గురించి విధిగా సభ్యులకు తెలియజేడయం వంటివి చేయాలంటున్నారు. గ్రూప్‌లో అడ్మిన్‌గా ఉండే వ్యక్తి ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలంటున్నారు. కనుక వాట్సాప్ అడ్మిన్లు మీరు కాస్త బాధ్యతగా ఉండండి.గ్రూపు సభ్యులను కూడా ఉండేలా చూడండి మరి.!