Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ వాయిదా వేసింది. ఈనెల 19వ తేదీకి విచారణను వాయిదా వేసిన న్యాయమూర్తి ఆ లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకీ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే.

Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
New Update

Chandrababu Bail Petition Adjourned: టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ వాయిదా వేసింది. ఈనెల 19వ తేదీకి విచారణను వాయిదా వేసిన న్యాయమూర్తి ఆ లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకీ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని విచారణ సందర్భంగా ప్రస్తావించిన న్యాయమూర్తి.. మధ్యంతర బెయిల్‌పై ఇప్పుడు విచారిస్తే క్వాష్ పిటిషణ్‌పై ప్రభావవం పడుతుందని అభిప్రాయపడ్డారు. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే.

మరోవైపు చంద్రబాబును జైలులో కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ములాఖత్‌కు దరఖాస్తు చేసుకోగా జైలు అధికారాలు తిరస్కరించారు. వారానికి మూడు సార్లు ములాఖత్‌కు అవకాశం ఉన్నా భువనేశ్వరి దరఖాస్తును తిరస్కరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ములాఖత్ విషయంలో కూడా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించడంపై భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిటెండెంట్‌గా ఉన్న రాహుల్ ప్రస్తుతం నాలుగు రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఆయన భార్యకు అనారోగ్యం కారణంగా ఆయన సెలవు పెట్టారని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం రాహుల్ స్థానంలో జైళ్ల శాఖ కోస్తాంధ్ర ప్రాంత డీఐజీ రవికిరణ్‌ జైలు పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు.

ఇక చంద్రబాబు అరెస్ట్ విషయంలో జరిగిన కీలక పరిణామాల గురించి ఎన్ఎస్జీ (NSG) కేంద్రహోంశాఖకు సమగ్ర నివేదిక పంపింది. బాబు అరెస్టయిన దగ్గర నుంచి రెండు రోజులు ఏం జరిగిందో మొత్తం నివేదికలో సమర్పించింది. సెప్టెంబర్ 8వ తేదీనుంచి 10 వతేదీ అర్ధరాత్రి 1గంట వరకూ జరిగిన విషయాన్ని మొత్తం పొందుపరిచింది. ఏసీబీ కోర్టు రిమాండ్, జైల్లో భద్రత వంటి విషయాల గురించి కూడా అందులో వివరించింది. అలాగే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి ఏంటి, ఆయనకు భద్రత ఏ విధంగా ఏర్పాటు చేశారనే విషయాన్ని కూడా ప్రస్తావించింది.

ఇది కూడా చదవండి: టీడీపీ గంటా శ్రీనివాసరావు హౌస్ అరెస్ట్..!!

#chandrababu-bail-petition #chandrababu-bail-petition-adjourned
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి