Home Remedies for Headache: అన్ని సీజన్ల మాదిరిగానే.. చలికాలంలోనూ వ్యాదులు వస్తుంటాయి. జలుబు, దగ్గు, ఉబ్బసం సమస్యలు వేధిస్తుంటాయి. ఆస్తమా ఉన్నవారి పరిస్థితి అయితే, మరింత దారుణంగా ఉంటుంది. చలికాలంలో ముఖ్యంగా తలనొప్పి సమస్య తీవ్రమవుతుంది. ఎన్ని మందులు వేసుకున్నా నొప్పి తగ్గదు. అయితే, తీవ్రమైన తల నొప్పిని సైతం తగ్గించే వస్తువులు మన వంటింట్లోనే ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తించం. అవును.. మనం నిత్యం వంటింట్లో వినియోగించే వస్తువులు తలనొప్పిని క్షణాల్లో మాయం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి తలనొప్పి నివారణకు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తలనొప్పి వ్యక్తిని ఆగమాగం చేస్తుంది. తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. తలనొప్పిని తట్టుకోవడం కష్టం అవుతుంది. ఎన్ని పనులు చేసినా నొప్పి తగ్గకపోతే.. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. దీని ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
యాపిల్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని.. దానిపై కాస్త ఉప్పు కలిపి తింటే నిమిషాల్లో తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. యాపిల్‌తో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నందు.. రోజూ ఒక యాపిల్ తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
వంటల్లో వినియోగించే లవంగాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయోన అందరికీ తెలిసిందే. ఆయుర్వేదం పరంగా లవంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. లవంగాలకు శరీరంలో వాపును, నొప్పిని తగ్గించే లక్షణం ఉంది. అందుకే.. లవంగాలను నమిలి తింటే చాలా రోగాలు నయం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. లవంగాలను నీటిలో మరిగించి.. ఆ నీటిని తాగితే ప్రయోజనం ఉంటుది. లేదంటే ఒక టవల్‌లో లవంగం మొగ్గలను కట్టేసి దాని వాసన చూసినా ప్రయోజనం ఉంటుంది.
హిందూ మతంలో తులసికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే ఆయుర్వదపరంగానూ దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. తులసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా.. నీటిలో తులసి వేసి, అల్లం వేసి మరిగించి.. ఆ నీటిని తాగితే.. ఎంతో ప్రయోజనం కలుగుతుంది. తలనొప్పితో బాధపడుతున్న వారు ఈ నీటిని తాగడం వలన ప్రయోజనం ఉంటుంది.
లవంగం నూనెతో మసాజ్ చేసినా కూడా తలనొప్పి నుంచి చాలా ఉపశమనం కలుగుతుంది. నుదిటిపై మసాజ్ చేసి.. తలకు ఒక క్లాత్ కట్టుకుని కాసేపు పడుకుంటే.. తలనొప్పి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:
కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ ఫామ్ ఇవే..!
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ బ్రిడ్జి మూసివేత.. ప్రత్యామ్నాయ రూట్ ఇదే!