Rajma Beans: రాజ్మాతో కడుపులో గ్యాస్..? ఇలా వండితే అలాంటి సమస్యలు రావు

సాధారణంగా శాకాహారులు రాజ్మా బీన్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. కానీ ఇవి తిన్న తర్వాత గ్యాస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణుల సూచన. ఈ సమస్యలను నివారించడానికి వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.

New Update
Rajma Beans: రాజ్మాతో కడుపులో గ్యాస్..? ఇలా వండితే అలాంటి సమస్యలు రావు

Rajma Beans: శాకాహారులకు రాజ్మా ( కిడ్నీ బీన్స్), పప్పులు.. ప్రోటీన్ కు గొప్ప మూలాలుగా పరిగణించబడతాయి. రాజ్మాలో శరీరానికి లభించే ఫైబర్ తక్కువగా ఉన్నప్పటికీ, తేలికగా జీర్ణం కాని ఫైబర్‌లను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఇది జీర్ణమవడంలో చాలా మంది ఇబ్బందిని ఎదుర్కుంటారు. అటువంటి పరిస్థితిలో, వంట చేయడానికి ముందు వాటిని నానబెట్టడం చాలా అవసరం. అలాగే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఇది తిన్న తర్వాత కడుపులో గ్యాస్ ఏర్పడటం, ఉబ్బరం వంటి సమస్యలను కూడా నివారించవచ్చు.

ఇంటి చిట్కాలు

  • పప్పు లేదా కిడ్నీ బీన్స్ నానబెట్టిన తర్వాత వాటిని నేరుగా వండకూడదు. బదులుగా, నానబెట్టిన తర్వాత మళ్ళీ 3-4 సార్లు నీటితో కడగాలి. తద్వారా వాటిలో ఉండే పిండిపదార్థాలు తొలగిపోతాయి. ఆ తర్వాత మాత్రమే ఉడికించాలి.
  • అలాగే కిడ్నీ బీన్స్ లేదా బఠాణీ వండే ముందు, వాటిని కడిగి శుభ్రమైన నీటిలో నానబెట్టండి. ఇప్పుడు అందులో ఒక అంగుళం అల్లం ముక్క, 10-15 కరివేపాకు, ఉ ప్పు, ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క, రెండు చిటికెడు ఇంగువ వేయాలి.

publive-image

  • ఈ పదార్థాలన్నింటినీ వేసిన తరవాత అరగంట పాటు బీన్స్ ను అలాగే ఉంచాలి. ఆ తర్వాత మసాలాలు వేసి నానబెట్టిన ఈ నీటిలోనే కిడ్నీ బీన్స్ ను ఉడికించాలి. అల్లం, ఇంగువ, కరివేపాకు, దాల్చినచెక్క, ఉప్పు లక్షణాలు నీటిలో శోషించబడతాయి. అదే నీటిలో వాటిని ఉడికించడం ద్వారా బీన్స్ లోని సంక్లిష్ట ఫైబర్.. గ్యాస్, గుండెల్లో మంట కలిగించే లక్షణాలను నాశనం చేస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Nose Bleeding: వేసవిలో ముక్కు నుంచి బ్లడ్ వస్తుందా .. ఇలా చేయండి..! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు