Kadapa: మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ ఇరువర్గాలు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొండాపురం మండలం కోడూరులో కాల్పులు కలకలం రేపాయి. వైసీపీ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ శ్రేణులు రాంమోహన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. లైసెన్స్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు.
రామ్మోహన్ రెడ్డి తన తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు చేయడంతో వివాదం తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో ఆందోళనకారులు బొల్లోరా వాహనంను ధ్వంసం చేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటన స్థలంకు చేరుకుని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారి నుంచి రివాల్వార్, మూడు తుటాలు స్వాధీనం చేసుకుని ఘటనపై విచారణ చేపట్టారు.
Kadapa: జగన్ సొంత జిల్లాలో కాల్పుల కలకలం.. వైసీపీ ఇరువర్గాల మధ్య బాహాబాహి..!
కడప జిల్లా కోడూరులో కాల్పులు కలకలం రేపాయి. వైసీపీ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాంమోహన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి లైసెన్స్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Translate this News: