Gold Price Are Stable Today : బంగారం ధరలు (Gold Rates) ఇటీవల కాలంలో తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. నిన్న కూడా కొద్దిగా తగ్గుదల కనబరిచింది బంగారం. ఇక ఈరోజు మాత్రం బంగారం ధరలు ఎటువంటి మార్పులు లేకుండా ఉన్నాయి. కొన్నిరోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న వెండి కూడా ఈరోజు బంగారం బాటలోనే నిలిచింది. వెండి ధరల్లో ఎటువంటి మార్పూ లేదు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 6న బంగారం ధరలు స్థిరంగా ఉండి బంగారం కొనాలని అనుకునేవారికి ఊరట కలిగించాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుదలతో ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్రభావం ఎప్పటిలానే మన మార్కెట్లపై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈరోజు మార్కెట్ ముగిసే సరికి బంగారం, వెండి ధరలు (Silver Price) కాస్త పెరుగుదల నమోదు చేసే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Gold Price Today : బంగారం నిలకడగా ఉంది.. వెండి కూడా అదే దారిలో!
బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,690, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,760 గా ఉంది. కేజీ వెండి కూడా స్థిరంగా ₹ 90,000 గా ఉంది.
Translate this News: