Ganesh Festival: గణపతి ఉత్సవాలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ పండగను హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. అయితే గణేశునికి ఎంతో ఇష్టమైన ఆహారాలు వండి నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలిగి వినాయకుని ఆశీర్వాదాలు త్వరగా లభిస్తాయట. గణపయ్య భోజనప్రియుడు. అందుకే వినాయక చవితి రోజున గణపతికి ఎలాంటి ఆహారాలు పెట్టాలో వాటి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వినాయక చవితి పండగ సందర్భంగా గణపతికి మోదకం ప్రసాదం అంటే చాలా ఇష్టమట. అందుకే అతన్ని మోదక హస్తా గజానన అని కూడా అంటారు. ఈ మోదకం స్వీట్ కొబ్బరి, బెల్లంతో తయారు చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది ఇది. ఈ తీపి పదార్థం చేసి గణేషుడికి పెడితే ఎంతో సంతోషిస్తాడని చెబుతున్నారు. దాంతో పాటూ బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూలు, బియ్యముతో చేసిన పాయసం, పండ్లు, పండ్ల రసాలు, తమలపాకులంటే కూడా గణపతికి ఇష్టమట. ఇవి నైవేద్యంగా చేసి గణేశుని పాదాల వద్ద సమర్పించి తర్వాత దానిని ప్రసాదంగా పంచాలి . ఇలా వీటన్నిటినీ నైవేద్యంగా పెట్టడం వల్ల గణేశుడు చాలా సంతోషిస్తాడు. అంతేకాదు ఇంటిల్లపాదికి ఆనందం, శ్రేయస్సుని కలిగిస్తాడు.
అంతే కాదు బొజ్జ గణేషునికి తాజా పండ్ల రసాన్ని కూడా పెట్టాలి. మామిడి, ద్రాక్ష, దానిమ్మ, యాపిల్ మొదలైన తాజా పండ్ల రసాన్ని అందించడం ద్వారా గణేశుడు చాలా సంతోషిస్తాడు. ఒకవేళ మీరు కనుక పండ్ల రసాన్ని తయారు చేయలేకపోతే అరటి, ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్లను సమర్పించవచ్చు. పండ్లు, పండ్ల రసాలను అందించడం గణపతి సంతోషిస్తాడు. ఇక వినాయక చవితి సందర్భంగా గణపతికి ఇష్టమైన వంటకం సమర్పించిన తర్వాత తప్పనిసరిగా తమలపాకులని తాంబూలంగా స్వామికి సమర్పించాలి. పైవిధంగా చేస్తే గణపయ్యని సులభంగా ప్రసన్నం చేస్కోవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.