Telangana: స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక..

అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ప్రసాద్‌ కుమార్‌ను స్పీకర్ స్థానం వద్దకు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర నేతలు తీసుకెళ్లి ఆయన్ని కూర్చోబెట్టారు.

Telangana: స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక..
New Update

Gaddam Prasad Kumar: తెలంగాణలో శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. అసెంబ్లీ స్పీకర్‌గా (Telangana Assembly Speaker) గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సహా.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యలు ప్రసాద్‌ కుమార్‌కు అభినందనలు తెలిపారు. ప్రసాద్‌ కుమార్‌ను స్పీకర్ స్థానం వద్దకు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర నేతలు తీసుకెళ్లి ఆయన్ని కూర్చోబెట్టారు. అయితే అంతకుముందు ప్రొటెం స్పీకర్‌గా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన అక్బరుద్దీన్ ఒవైసీ మరికొంతమంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పద్మారావులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read: పలు శాఖలకు నిధులు విడుదల చేసిన మంత్రి భట్టి విక్రమార్క..

#telugu-news #telangana-news #telangana-assembly #gaddam-prasad-kumar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe