BREAKING : గొర్రెల పంపిణీలో స్కాం.. నలుగురు అధికారులు అరెస్ట్!

గొర్రెల పంపిణీ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశుసంవర్ధక శాఖలోని నలుగురు అధికారాలు అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. గొర్రెల పంపిణీ లో ఈ నలుగురు రూ.2.10 కోట్లు నొక్కేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

BREAKING : గొర్రెల పంపిణీలో స్కాం.. నలుగురు అధికారులు అరెస్ట్!
New Update

Gorrela Pampini Scam Case : గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం యాదవ సోదరుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ(Gorrela Pampini) పథకంలో అవకతవకలు జరిగినట్లు ఇటీవల కాగ్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ కేసును తెలంగాణ(Telangana) ఏసీబీ సీరియస్ గా తీసుకుంది. ఈ స్కాంలో ఉన్న అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా పశుసంవర్ధక శాఖ లోని నలుగురు అధికారాలు అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఈ శాఖకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, డిప్యూటీ డైరెక్టర్ రఘుపతి రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్, అసిస్టెంట్ డైరెక్టర్ఆదిత్య కేశవ సాయి లని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. గొర్రెల పంపిణీ లో ఈ నలుగురు అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచి రూ.2.10 కోట్లు నొక్కేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీరిని అదులోపు తీసుకొని మిగితా సమాచారాన్ని లాగుతున్నారు.

Also Read : Mega DSC : వారం రోజుల్లో తెలంగాణలో మెగా డీఎస్సీ?


#brs-party #cm-revanth-reddy #gorrela-pampini-scam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి