ఒకటి ఉత్తర ధ్రువం, మరొకటి దక్షిణ ధృవం..
ఈ మేరకు హిందూ మహాసభ, ముస్లిం లీగ్ పేర్లు వింటే.. ఒకటి ఉత్తర ధ్రువం, మరొకటి దక్షిణ ధృవంగా అనిపిస్తుంది. సాధారణంగా రెండు పార్టీలు సైద్ధాంతికంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. కానీ వాటి మధ్య ఉన్న ఒక సారూప్యత ఉంది. రెండూ మతం ఆధారిత రాజకీయాలు చేస్తాయి. మతం ఆధారిత దేశం అనే సూత్రాన్ని విశ్వసిస్తాయి. వీరిద్దరి మధ్య మరో సారూప్యత ఉంది. గతంలో ఇద్దరూ సఖ్యతగా ఉండి, కలిసి ప్రభుత్వాలను నడిపారు. 1930ల చివరి నుంచి 1940ల ప్రారంభం వరకు కలిసి పనిచేశారు. హిందూ మహాసభకు వినాయక్ దామోదర్ సావర్కర్ నాయకత్వం వహించగా, ముస్లిం లీగ్ నాయకత్వం మహమ్మద్ అలీ జిన్నా చేతిలో ఉండేది. ఈ రెండు గ్రూపులు మూడు రాష్ట్రాల్లో కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
ఇది కూడా చదవండి: Telangana: ఫార్మా-డీ డాక్టర్ పట్టాతో నడి చౌరస్తాలో యువత!
ముస్లిం లీగ్ నుంచి హిందూ మహాసభకు ఆహ్వానం..
ఆ నాడు సింధ్ ప్రభుత్వంలో చేరమని ముస్లిం లీగ్ నుంచి హిందూ మహాసభకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని మహాసభ సంతోషంగా అంగీకరించింది. రెండు పార్టీల అంగీకారంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 1941లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కారణంగా బెంగాల్‌లో కూడా ప్రభుత్వం ఏర్పడింది. బెంగాల్ ప్రభుత్వంలో లీగ్‌కు చెందిన ఫజ్లుల్ హక్ ప్రధానమంత్రిగా ఉన్నారు. మహాసభ సీనియర్ నాయకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ రాజకీయంగా ఈ ప్రభుత్వాన్ని నడిపించారు. ఈ సంకీర్ణ ప్రభుత్వం నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లో కూడా రూల్ చేసింది.