Uttar Pradesh : తరగతిలోకి చేరిన వరద నీరు..ఈత కొట్టిన విద్యార్థులు! ఉత్తరప్రదేశ్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల చాలా ప్రదేశాలు నీట మునిగాయి. అలా ఓ పాఠశాల తరగతి గదుల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది.క్లాసుల్లోకి వరదనీరు చేరడంతో పిల్లలంతా సరదాగా నీటిలో ఈత కొట్టారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. By Bhavana 02 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Flood Water : సాధారణంగా ఈత నేర్చుకోవాలంటే... పట్టణాల్లో ఉండే వారు స్విమ్మింగ్ పూల్స్ (Swimming Pools) కి వెళ్తారు. కొంచెం గ్రామీణ ప్రాంతాల వారు అయితే కాలువలు, చెరువుల్లో నేర్చుకుంటుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఏం చక్కగా నీరే మన దగ్గరకే వస్తే.. ఇక ఆగుతామా..పెద్దవారికే ఎంతో సరదాగా ఉంటుంది. అదే చిన్నపిల్లలు అయితే ఇక వారి ఆనందానికి అవధులే ఉండవు. ఏకంగా తరగతి గదులే ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల (Rains) వల్ల చాలా ప్రదేశాలు నీట మునిగాయి. అలా ఓ పాఠశాల తరగతి గదుల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. కానీ పాఠశాల యజమాన్యం మాత్రం సెలవులు ప్రకటించకుండా తరగతులు నిర్వహించారు. ఉత్తర్ ప్రదేశ్ వరదలు కారణంగా స్కూల్ లోకి చేరిన వరద నీళ్లు.. ఆ నీళ్లల్లో ఈత కొడుతున్న విద్యార్థులు.. #UttarPradesh #Heavyfloods #viralvideo #RTV pic.twitter.com/aQupMAsxka — RTV (@RTVnewsnetwork) August 2, 2024 కానీ క్లాసుల్లోకి వరదనీరు చేరడంతో పిల్లలంతా సరదాగా నీటిలో ఈత కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన కొందరు ఫన్నీ కామెంట్లు పెడుతుంటే..కొందరు మాత్రం పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Also Read : విజయ్ లుక్ చూస్తే షాకే..! ‘VD12’ ఫస్ట్ లుక్ పోస్టర్ #uttar-pradesh #viral-video #classroom మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి