ట్విటర్ ఆఫీస్ వస్తువులను వేలం వేయనున్న మస్క్!

ట్విటర్ ఆఫీస్ వస్తువులన్నింటినీ వేలం వేయనున్నట్టు ఎలోన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ బర్డ్, ప్రొజెక్టర్, ఐమాక్ డిస్‌ప్లే, కాఫీ మెషీన్లు వంటి వస్తువులు జనవరిలో వేలం వేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ వేలం 25 నుండి 50 డాలర్లకు ప్రారంభమవుతుందని మస్క్ వెల్లడించారు.

ట్విటర్ ఆఫీస్ వస్తువులను వేలం వేయనున్న మస్క్!
New Update

ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలోన్ మస్క్ టెస్లా, స్పేస్‌ఎక్స్‌ల సీఈవో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్డ్,  ఇద్దరూ ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.ఈ విధంగా, టెస్లా, స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్, ఎక్స్ ప్లాట్‌ఫారమ్ ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలోన్ మస్క్ నాయకత్వంలో పనిచేస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో టెస్లా ప్రపంచ అగ్రగామిగా ఉంది.

ముఖ్యంగా మస్క్ ట్విటర్ కంపెనీని కొన్న రోజు నుంచి  ఏదో ఒక కారణంతో ఆయన పేరు మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు కూడా 2 రకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎలోన్ మస్క్ ట్విటర్ ఆఫీస్ వస్తువులన్నింటినీ వేలం వేయనున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్ బర్డ్, ప్రొజెక్టర్, ఐమాక్ డిస్‌ప్లే, కాఫీ మెషీన్లు, కుర్చీలు, ఫ్రిజ్, పిజ్జా మేకర్ ఇలా అన్ని కిచెన్ వస్తువులను వేలం వేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది .ఈ వేలం జనవరిలో జరగనుందని.. వేలం 25 నుండి 50 డాలర్లకు ప్రారంభమవుతుందని సమాచారం.

మస్క్ సుమారు $1 బిలియన్ ఖర్చులను తగ్గించుకోవాలని ట్విట్టర్ బృందానికి చెప్పారు. అందుకే ఇలా వేలంపాట నిర్వహించబోతున్నారు. ప్రకటన ఇప్పటికే జర్మనీలోని టెస్లా ఫ్యాక్టరీలో ఉద్యోగులను 10% కుదించే యోచనలో ఎలాన్ మస్క్ ప్రకటించారు.. ఇది విన్న జర్మన్ టెస్లా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.. ఇప్పటికే ఉద్యోగులు ఉద్యోగ భద్రత, తక్కువ వేతనాలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులను తగ్గించే ప్రణాళికను ఎలాన్ మస్క్ చేపట్టనున్నారు.

ఇలాంటి వాతావరణంలో ఈ కంపెనీ నుంచి 65 వేల కాఫీ కప్పులు మాయమైనట్లు ఫిర్యాదు అందగా.. ఆ ఫ్యాక్టర్ మేనేజర్ ఇలాంటి షాకింగ్ సమాచారాన్ని బయటపెట్టారు. అంటే, ఆ ప్లాంట్‌లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఆధారంగా, సగటు ఉద్యోగి ఇంటికి 5 కప్పుల కాఫీ తీసుకుంటాడు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు.. కానీ, ఎలోన్ మస్క్ ఇప్పటికే ట్విట్టర్ ఉత్పత్తులను తగ్గించి వేలం వేయాలని బాధ పడుతుండగా.. 65 వేల కాఫీ కప్పులు మాయమవడం అతడిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

#elon-musk
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి