EC : మమత, కంగనలపై వివాదస్పద వ్యాఖ్యలు..సుప్రియా శ్రీనేత్, దిలీప్ ఘోష్‌లకు ఈసీ షోకాజ్ నోటీసులు..! బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అభ్యంతరకర పోస్ట్‌లు చేసినందుకు గాను దిలీప్ ఘోష్‌కు బిజెపి లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను సుప్రియా శ్రీనేత్ కు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. మార్చి 29 సాయంత్రంలోగా ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. By Bhoomi 27 Mar 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి EC : మహిళలపై వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నేత దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ లకు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల సుప్రియ శ్రీనేత్ సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందున ఎన్నికల సంఘం సుప్రియ శ్రీనేత్ కు నోటీసు పంపింది. అదేవిధంగా మమతా బెనర్జీపై వ్యాఖ్యానించినందున బిజెపి నాయకుడు దిలీప్ ఘోష్‌కు కూడా ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీటిపై మార్చి 29 సాయంత్రంలోగా ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఘోష్ నుంచి సమాధానాలు కోరారు. ఇటీవల కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్.. మండి లోక్‌సభ అభ్యర్థిగా కంగనా రనౌత్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలకు దిగారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కంగనా చిత్రాన్ని షేర్ చేశారు. "ఈ రోజు మార్కెట్లో ధర ఎంత ఉందో ఎవరైనా చెప్పగలరా?"అంటూ అసభ్యకరంగా పోస్టు చేశారు. ఈపోస్టు నెట్టింట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనేత్ ఇన్ స్టా ఖాతాలో ఈ పోస్టు కనిపించడంతో బీజేపీ వర్గాలు భగ్గుమన్నాయి. ఆ పోస్టు తాను చేసిందని కాదని సుప్రియా స్పష్టం చేశారు. తన ఖాతాను చాలా మంది యాక్సెస్ చేస్తుంటారని..ఈ విషయం తన దగ్గరకు రాగానే పోస్టును డిలీట్ చేసినట్లు చెప్పారు. ఎవరు ఆ పనిచేశారో తేల్చే పనిలో ఉన్నానంటూ బదులిచ్చారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ కొన్నిసార్లు తనను తాను గోవా కుమార్తె అని, కొన్నిసార్లు త్రిపుర కుమార్తె అని పిలుస్తారని ఘోష్ అన్నారు. ఘోష్ వ్యాఖ్యలపై టీఎంసీ నాయకులు మండిపడుతున్నారు. బెంగాల్ లోని బర్దమాన్, దుర్గాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా దిలీప్ ఘోష్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం వీరిద్దరికీ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. మార్చి 29 సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలంటే ఆదేశాలు జారీ చేసింది. ఇది కూడా చదవండి: ఆయన మక్కల దొంగ.. కవిత క్రిమినల్: అరవింద్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ! #election-commission #latest-news #meeting #lok-sabha-elections-2024 #dilip-ghosh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి