BRS First List: రేపట్నుంచే ఎలక్షన్ 2023 రేస్ ను షురూ చేస్తున్న కారు.. 100 సీట్లే టార్గెట్!!

ఎన్నికల నగారా మోగడానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో కారు స్పీడ్ ను పెంచుతోంది. రేపటి నుంచే ఎలక్షన్ 2023 రేస్ ను స్టార్ట్ చేయబోతుంది.  దీంతో అన్ని పార్టీల కంటే ముందే రయ్.. మని దూసుకెళ్లి రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ ను అధికార పక్షం బీఆర్ఎస్ పెంచనుంది. ఈ రేస్ లో గులాబీ పార్టీ ఖాతాలోకి తప్పకుండా 100 సీట్లు పడడం ఖాయమని అగ్రనాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది...

BRS First List: రేపట్నుంచే ఎలక్షన్ 2023 రేస్ ను షురూ చేస్తున్న కారు.. 100 సీట్లే టార్గెట్!!
New Update

BRS First List: ఎన్నికల నగారా మోగడానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో కారు స్పీడ్ ను పెంచుతోంది. రేపటి నుంచే ఎలక్షన్ 2023 రేస్ ను స్టార్ట్ చేయబోతుంది.  దీంతో అన్ని పార్టీల కంటే ముందే రయ్.. మని దూసుకెళ్లి రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ ను అధికార పక్షం బీఆర్ఎస్ పెంచనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రేపు శ్రావణ మాసం మొదటి సోమవారం రోజున గులాబీ బాస్ బరిలోకి దింపనున్న అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయడానికి రంగాన్ని సిద్ధం చేశారు.

96 నుంచి 105 మందితో ఫస్ట్ లిస్ట్..!

రేపు తెలంగాణా భవన్ వేదికగా 96 నుంచి 105 మందితో జాబితాను అధికారికంగా కేసీఆర్ రిలీజ్ చేయనున్నారు. ఎందుకంటే ఆయన లక్కీ నెంబర్ 6 కాబట్టి. ఆ సెంటిమెంట్ ను ఆయన ఫాలో అవుతున్నారు. ఇక ఈ ఫస్ట్ లిస్ట్ లో దాదాపుగా సిట్టింగులకే సీట్లు ఖరారయినట్టు సమాచారం. కొన్ని స్థానాల్లో మాత్రం అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థుల మార్పులు చోటుచేసుకోనున్నాయి.

100 సీట్లే టార్గెట్ గా..!

మరోవైపు ఫస్ట్ లిస్ట్ ను సిద్ధం చేసే సమయంలోనే.. కూర్పులో భాగంగా ఈసారి బీఫాం ఇవ్వలేని వాళ్లను, అసంతృప్తులను బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇప్పటికే బుజ్జగించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం దొరకని వాళ్లు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో ఏదో ఒక కీలక పదవి తప్పకుండా ఇస్తామని పార్టీ అధినాయకుడు హామీ ఇచ్చినట్టు సమాచారం.

అయితే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ప్రతి నియోజకవర్గం ఇల్లిల్లూ, వాడవాడా తిరిగి అభ్యర్థులు లబ్ధిదారులను కలవాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రేస్ లో గులాబీ పార్టీ ఖాతాలోకి తప్పకుండా 100 సీట్లు పడడం ఖాయమని అగ్రనాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి