Smoking : పొగ తాగడం(Smoking) ఆరోగ్యానికి హానికరమని అందరికి తెలుసిందే. ఇది క్యాన్సర్(Cancer) తోపాటు ఇతర వ్యాధులకు కారణమవుతుందని వైద్యులు చెబుతుంటారు. దీంతో చివరకు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది దీని కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్నారని ప్రస్తుతం నివేదికలో వెల్లడైంది. కొన్ని రకాల టెన్షన్ల కారణంగా ఈ అలవాటు స్టార్ట్ చేసి.. క్రమంగా పొగకు బానిస అవుతున్నారు. అంతేకాకుండా సిగరెట్ తాగేవారితోపాటు పక్కన ఉన్న వారికి ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు వలన పక్షవాతం, ఊపిరితిత్తుల క్యాన్సర్(Lung Cancer), హృదయ సంబంధ వ్యాధులు, వివిధ క్యాన్సర్లతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 13.50 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అధ్యాయనాలు చెబుతున్నాయి. పురుషులు, మహిళలు పొగ తాగడం వలన లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుందట. సిగరెట్ తాగడానికి, లైంగిక ఆరోగ్యానికి మధ్య అనుసంధానం ఉంది. ఇది లిబిడో, లైంగిక పనితీరు, సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుందని నిపుణులు వెల్లడించారు. అయితే.. ధూమపానానికి.. శృంగారజీవితానిక మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వీర్యం, యోని సమస్యలు:
- పొగాకు(Tobacco) లో ఉండే అనేక డేంజరస్ రసాయనాలు వలన వీర్యంతోపాటు, యోని ద్రవాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ధూమపాన, మద్యం, కాఫీ, డ్రగ్స్ వంటి ఇతర పదార్థాలు దుర్వాసనతో కూడినవి ఇందుకు కారణం.
రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుంది:
- పొగాకులోని వ్యసనపరుడైన నికోటిన్, పురుషాంగానికి బ్లడ్ సరఫరా చేసే నాళాలతో పాటు బాడీ అంతటా రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
అండం నాణ్యత క్షీణించడం:
- సిగరెట్ తాగడం వల్ల స్త్రీలు సంతానోత్పత్తి సవాళ్లను ఎదుర్కొంటారు. ధూమపానం అండాశయ నిల్వల క్షీణతను వేగవంతం చేసి అండం సంఖ్య తగ్గడానికి, అండం నాణ్యత క్షీణించడానికి దారితీస్తుందని అధ్యయనంలో తెలింది. అంతేకాదు సిగరేట్ తాగే మహిళలు 50 ఏళ్లలోపు మెనోపాజ్ సంతానోత్పత్తిని ప్రభావితం చేయడంతో పాటు అనేక ఆరోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.
స్పెర్మ్‌కౌంట్ తగ్గడం
- తండ్రులు కావాలని కోరుకునే అందరికి ఉంటుంది. స్పెర్మ్ కౌంట్(Sperm Count) తగ్గడానికి ముఖ్య కారణం ధూమపానం. సిగరెట్ తాగే వారిలో స్పెర్మ్ కౌంట్‌తోపాటు, సంతానోత్పత్తికి ఆటంకం, పురుషుల్లో వీర్యం తగ్గడం, టోటల్ స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ చలనశీలత తగ్గిస్తుందని వెల్లడైంది.
ఇది కూడా చదవండి: ఉదయాన్నే టిఫిన్‌కు బదులు అన్నం తింటే ఏమవుతుంది?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.