Soaked Peanuts: నానబెట్టిన బాదంలో బలంతోపాటు శక్తి వస్తుంది. కానీ అది ఎక్కువ ఖరీదైనది కావడంతో అందరూ దీనిని తినలేరు. బాదంకు బదులు నానబెట్టిన వేరుశెనగ తినడం వలన చాలా ప్రయోజనాలు లభిస్తాయి ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది ఆరోగ్యంగా ఉంచటంతోపాటు చౌకైన, ఇంటిలో ఉంటే ఐటమ్. నానబెట్టిన వేరుశెనగలను తినడం వల్ల ప్రొటీన్లు, పీచుపదార్థాలు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. నీటిలో నానబెట్టడం వలన ఫైటిక్ యాసిడ్‌ను తొలగిస్తుంది. ఇది పోషణను గ్రహించకుండా నిరోధిస్తుంది. అదనంగా టానిన్లు గింజల నుంచి విడుదలవుతాయి. ఇది వాటి రుచి, ఆకృతిని మెరుగుపరుస్తుంది. వీటిల్లో మెగ్నీషియం, భాస్వరం, రాగి, మాంగనీస్, ఫైబర్, థయామిన్, నియాసిన్, విటమిన్-ఇ, బయోటిన్, మొదలైనవి ఉన్నాయి.
వేరుశెనగల్లో ప్రోటీన్ పుష్కలం:
- కండరాలు దృఢంగా ఉండాలంటే ప్రొటీన్లు అవసరం. వేరుశెనగ నుంచి 22 నుంచి 30 శాతం కేలరీలు ప్రోటీన్ నుంచి వస్తాయి. ఇది ప్రోటీన్ పరంగా అద్భుతంగా లభిస్తాయి.
మంచి కణాలు అధికం:
- వాటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఉండే కొవ్వు ఆరోగ్యకరమైనది. మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు గుండె, మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మంచి కణాల పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.
గర్భధారణ స్త్రీ, పిండంకు మేలు:
- గర్భిణీ స్త్రీలు వేరుశెనగ తీసుకుంటే.. స్త్రీ, పిండం రెండింటికీ సహాయపడే పోషకాలను ఎక్కువగా ఉంటాయి. దీని విటమిన్ B9 పిండం అభివృద్ధిలో చాలా అవసరం. ఇది ఫోలేట్ లోపంలోని లక్షణాలను తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యం:
- నానబెట్టిన వేరుశెనగ తింటే మంచి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా అనేక గుండె సమస్యలను దూరం చేస్తుంది.
ఇది కూడా చదవండి: ఈ పార్క్‌కి వెళ్తే మీరూ సముద్రపు దొంగల్లా మారిపోతారు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పిల్లలు మంచంపై కూర్చుని అన్నం తింటున్నారా..ఈ విషయాలు గుర్తుంచుకోండి