Jammu & Kashmir: భారతీయులకు ప్రతి సైనికుడూ కుటుంబసభ్యుల వంటివారన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి సైనికులతో మాట్లాడారు.
ఇది కూడా చదవండి: కెరటాల అడుగున మునిగిన ద్వారకనూ దర్శించొచ్చు.. గుజరాత్ ప్రభుత్వ సబ్‌మెరైన్ సేవలు
పూంఛ్ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడడంతో పలువురు సైనికులు నేలకొరిగిన విషయం తెలిసిందే.మరోవైపు, ఇటీవలి ఆపరేషన్లలో లోపాలకు సంబంధించి బ్రిగేడియర్ స్థాయి అధికారిపై విచారణ జరుగుతోంది. ఇదిలాఉంటే పూంఛ్‌లో కస్టడీలో ఉన్న ముగ్గురు పౌరులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో భద్రత పరిస్థితులను సమీక్షించేందుకు రాజ్‌నాథ్ సింగ్ అక్కడ పర్యటించారు.
ఉగ్రవాదుల దాడుల్ని అడ్డుకోవడంలో, అరికట్టడంలో సైన్యం సాహసం, తెగువ దేశ ప్రజలందరికీ తెలుసన్నారు సైనికుల త్యాగాలు అమూల్యమైనవన్నారు. ప్రభుత్వం సైన్యానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జవాన్ల భద్రత, సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి: ఇలా చేస్తే గులాబీ మొక్కలోని ప్రతీ కొమ్మకు పూలు పూస్తాయి..!!