ధోనీ వీడ్కోలుపై స్పందించిన సీఎస్‌కే సీఈవో.. ఏమన్నారంటే

ధోనీ రిటైర్మెంట్ పై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ స్పందించారు. ఈ విషయంపై మాకు ఎలాంటి సమాచారం లేదు. కెప్టెన్ ధోనీనే నేరుగా సమాధానం ఇస్తాడు. అతడి ఫిట్‌నెస్‌ బాగుంది. జిమ్‌లో వర్కౌట్స్‌ కూడా ప్రారంభించాడు. మరో 10 లేదా 15 రోజుల్లో నెట్ ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టే అవకాశం ఉందన్నారు.

ధోనీ వీడ్కోలుపై స్పందించిన సీఎస్‌కే సీఈవో.. ఏమన్నారంటే
New Update

భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటర్మెంట్ పై కొంతకాలంగా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గత సీజన్ లోనూ ధోని ఆడతాడో లేదో అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు జరిగిన విషయం తెలిసిందే. కాగా మోకాలు గాయంతోనే సీజన్ 16 ఆడిన ధోని చెన్నైకి 5వసారి కప్ అందించాడు. అయితే మరో మూడు నెలల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL 2024) 17వ సీజన్‌ ప్రారంభం కానుండగా ధోని విడ్కోలుపై మళ్లీ డిస్సషన్ మొదలైంది.

ఇప్పటికే మినీ వేలం జరగగా ప్రస్తుతం 42 ఏళ్ల ధోనీ మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ధోనీ ఈ సీజన్‌ ఆడతాడా? లేదా? అనే చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు మరికొందరు మాత్రం 2024 అడుతున్నాడని, ఇదే అతనికి చివరి సీజన్‌ అంటూ బలంగా చెబుతున్నారు. అయితే దీనిపై ధోనీ నుంచి ఎలాంటి స్పందన లేకపోగా.. ఈ క్రమంలో ధోనీ జట్టుతో కొనసాగే విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీవో కాశీ విశ్వనాథన్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘ఈ విషయంపై మాకు ఎలాంటి సమాచారం లేదు. కెప్టెన్ ధోనీనే నేరుగా సమాధానం ఇస్తాడు. కానీ, ఇప్పటి వరకు దీనిపై చర్చించలేదు. ప్రస్తుతం ధోనీ శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడి ఫిట్‌నెస్‌ బాగుంది. జిమ్‌లో వర్కౌట్స్‌ కూడా ప్రారంభించాడు. మరో 10 లేదా 15 రోజుల్లో నెట్ ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది’ అని విశ్వనాథన్‌ చెప్పుకొచ్చారు. దీంతో ధోని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి : ‘ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌’లోకి రామ్‌చరణ్‌ ఎంట్రీ.. ఏ టీమ్ ను కొన్నాడంటే

ఇదిలావుంటే.. ఇటీవల ఐపీఎల్‌కు వీడ్కోలు తర్వాత ఏం చేస్తారపి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ధోని ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇంకా క్రికెట్‌ ఆడుతున్నా. ఐపీఎల్‌లో బరిలో ఉన్నా. వీడ్కోలు తర్వాత ఏం చేస్తానన్నది ఆసక్తికరంగా ఉంటుంది. కచ్చితంగా కొంత కాలం సైన్యంలో పనిచేస్తా. గత కొన్నేళ్లుగా ఆ పని చేయలేకపోయా' అని తలైవా తెలిపాడు.

#csk #dhoni #farewell #kashi-viswanathan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి