ఈ రోజుల్లో మహిళలపై అఘాయిత్యాలు పెరిపోతున్నాయి. వయస్సతో సంబంధం లేకుండా కొందరు దుండగులు మహిళలపై దారుణానికి పాల్పడుతున్నారు. ఇటీవల తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది టీచర్‌ను కత్తితో పొడిచి కిరాతంగా చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తంజావురులో రమణి అనే యువతి ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తోంది. ఇటీవల తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధం చూశారు. మదన్ అనే వ్యక్తితో పెళ్లి చూపులు జరిగాయి.
ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్!
పెళ్లికి నిరాకరించిందని కత్తితో దారుణంగా..
ఇరుకుటుంబాలకి సంబంధం ఒకే కానీ.. రమణికి ఇష్టంలేదని చెప్పింది. దీంతో ఆ యువతిపై మదన్ కోపం పెంచుకున్నాడు. నాతోనే పెళ్లికి నిరాకరిస్తుందా? అని రమణి వర్క్ చేస్తున్న స్కూల్‌కి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో రమణి అక్కడిక్కడే మరణించింది. మెడపై తీవ్రంగా గాయం కావడంతో ఆమె అక్కడే మరణించింది. స్కూల్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..!
ఇదిలా ఉండగా ఇటీవల హైదరాబాద్‌లో ఓ 5 ఏళ్ల బాలుడిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన ఓ కుటుంబం బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి జీవనం సాగిస్తున్నారు. కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇదే ఏరియాలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఓ 5 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వీరి ఇంటికి సమీపంలో ఓ యువకుడు పండ్ల వ్యాపారం చేస్తున్నాడు.
ఇది కూడా చూడండి: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా
ఆ బాలుడుతో పండ్ల వ్యాపారి స్నేహం చేయడం మొదలు పెట్టాడు. రోజూ పండ్లు ఇస్తూ బాలుడకి దగ్గర అయ్యాడు. చివరికి తల్లిదండ్రులు లేని సమయంలో చూసి బాలుడిని కత్తితో బెదిరించి బాత్రూమ్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. బాలుడు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యి ఆ బాలుడిని కాపాడారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!