ఆసుపత్రిలో ఏడు నెలల చిన్నారి మృతి.. డాక్టర్ పై కత్తితో బంధువుల దాడి

పెద్దపల్లి జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఏడు నెలల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యం వికటించడం వల్లే ఆ చిన్నారి చనిపోయిందని బంధువులు వైద్యుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో ఉన్న అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

Breaking: ఏపీలో మరో భారీ ప్రమాదం..!
New Update

TG News :

 పెద్దపల్లి జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఏడు నెలల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యం వికటించడం వల్లే ఆ చిన్నారి చనిపోయిందని బంధువులు వైద్యుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. పెద్దపల్లి పట్టణంలోని చింతలవాడకు చెందిన ఖదీర్‌, రేష్మ దంపతుల ఏడు నెలల పాప మూడ్రోజుల క్రితం అనారోగ్యానికి గురవ్వడంతో.. స్థానిక సిద్ధార్థ ఆస్పత్రికి తీసుకువచ్చారు.

గురువారం పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. డాక్టర్‌ సూచన మేరకు చిన్నారిని తండ్రి ఖదీర్‌ అంబులెన్స్‌లో కరీంనగర్‌ తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆ చిన్నారికి ఎక్కువ మోతాదులో మందులు ఇవ్వడం వల్లే మృతిచెందిందంటూ ఖదీర్‌ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో ఉన్న అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

డాక్టర్‌పై కత్తితో దాడి చేశారు. బయటకు వచ్చిన డాక్టర్‌.. రాజీవ్‌ రహదారి వెంట పరుగులు తీశారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్రం చేసినా.. చిన్నారి బంధువులు వినలేదు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న రామగుండం సీపీ శ్రీనివాస్‌, డీసీపీ చేతన, ఏసీపీ కృష్ణ, ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఘటనా అక్కడికి చేరుకొని, వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.

కాగా డాక్టర్‌పై దాడి చేయడంపై ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు రమాకాంత్‌ కలెక్టర్‌ శ్రీకోయహర్షకు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకునే వరకు పెద్దపల్లిలో వైద్య సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు ఐఎంఏ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా శుక్రవారం కరీంనగర్‌లోనూ ఓపీ సేవలను నిలిపివేయనున్నట్లు ఐఎంఏ ప్రకటించింది.

#peddapalli-district
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe