Teachers day 2023: అక్కడ టీచర్లకు నెలకు 5 లక్షల జీతం.. విద్యావ్యవస్థ కూడా అదుర్స్!

టీచర్స్ డే(సెప్టెంబర్‌ 5) సందర్భంగా ప్రతిఒక్కరూ తమ గురువులను గుర్తు తెచ్చుకుంటున్నారు. స్కూల్‌, కాలేజీల్లో విద్యార్థులు నేరుగా విషెస్‌ చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రపంచంలో ఏ దేశంలో టీచర్లకు అత్యధిక జీతాలు ఇస్తారోనని ఆసక్తి చూపిస్తున్నారు. లక్సెంబర్గ్‌లో సగటున నెలకు రూ.5లక్షల జీతాన్ని పొందుతున్నారు టీచర్లు.

Teachers day 2023: అక్కడ టీచర్లకు నెలకు 5 లక్షల జీతం.. విద్యావ్యవస్థ కూడా అదుర్స్!
New Update

Countries that pay highest starting salary for high school teachers: ఇవాళే(సెప్టెంబర్ 5) టీచర్స్ డే. కేవలం స్కూల్స్‌, కాలేజీల్లోనే కాదు.. నిజజీవితంలోనూ మనకు గురువులుంటారు. అలాంటివారిందరికి విషెస్‌ చెప్పండి. అటు స్కూల్స్‌లో ఎలాగో ఇవాళ పిల్లలు టీచర్లలా మారిపోతారు. వారిని అనుకరిస్తూ టీచర్లను ఖుషీ చేస్తారు. టీచర్లు కూడా ఇవాళ సీరియస్‌గా ఉండరు.. పిల్లలతో ఎంతో సరదగా గడుపుతారు. ఇలా ఎప్పుడు ఎలా ఉండాలో తెలిసిన మన భారతీయ టీచర్లకు జీతాలు మిగిలిన దేశాలతో పోల్చితే అంతంతమాత్రమే. కేవలం మన దగ్గరే కాదు.. అగ్రరాజ్యం అమెరికాలోనూ టీచర్లకు వేతనాలు తక్కువేనట. అందుకే వేరే దేశాల నుంచి అమెరికాలోని విద్యాసంస్థలు టీచర్లను రిక్రూట్‌చేసుకుంటున్నాయి. మరి ఏ దేశంలో టీచర్లకు శాలరీలు ఎక్కువ..?

ప్రపంచ బ్యాంక్‌ డేటా, లెర్నింగ్ పోలీస్ ఇన్‌స్టట్యూట్ ప్రకారం.. ఉపాధ్యాయులకు తక్కువ వేతనం లభిస్తుంది.. ఇది చాలా దేశాలు విద్యావేత్తల కొరతను ఎదుర్కోవటానికి ఒక కారణం కావచ్చు. నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ నుంచి సేకరించిన డేటా ప్రకారం అమెరికాలో అనేక రాష్ట్రాలు టీచర్లకు వేతనాలు తక్కువ ఇస్తున్నాయి. దీంతో అమెరికాలోకి ఇతర దేశాల నుంచి ఔట్ సోర్సింగ్ టీచర్లు వస్తున్నారు.

హైస్కూల్ టీచర్లకు అత్యధిక వేతనాలు చెల్లించే దేశాల జాబితాపై ఓ లుక్కేయండి:

1.లక్సెంబర్గ్- రూ.58,91,995.2282

ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ నివేదిక ప్రకారం లక్సెంబర్గ్‌లో ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ఉపాధ్యాయులు ఉన్నారు. సెకండరీ టీచర్లు తమ విదేశీ సహోద్యోగులతో పోలిస్తే ఎక్కువ సంపాదిస్తారు. ఈ దేశంలో విద్యావిధానం త్రిభాషా పద్ధతిలో ఉంటుంది లక్సెంబర్గిష్, జర్మన్, ఫ్రెంచ్ భాషలను తప్పనిసరిగా అభ్యసించాలి.

2. స్విట్జర్లాండ్ -రూ.51,90,214.9404

2018 సంవత్సరానికి గాను ఓ ప్రముఖ మీడియా సంస్థ తాజా నివేదిక ప్రకారం టీచర్ల వేతనం విషయంలో స్విట్జర్లాండ్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. స్విట్జర్లాండ్‌లో విద్యావిధానం 26 కంటోన్మెంట్‌లతో వికేంద్రీకరించి ఉంటుంది.

3. జర్మనీ -రూ.47,73,219.2762

మిగతా దేశాలతో పోలిస్తే జర్మనీలో విద్యావిధానం భిన్నంగా ఉంటుంది. ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు హాజరవుతున్నారు. చాలా తరగతులు జర్మన్ భాషలోనే నిర్వహిస్తారు. ఇది తర్వాతి కాలంలో విద్యార్థులకు సమస్యను కలిగిస్తుంది. ఎందుకంటే జర్మనీ కాకుండా మిగిలిన దేశాల్లో చదవడానికి వెళ్లినప్పుడు ఇది ఇబ్బంది. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే జర్మనీ, యూరప్‌ దేశాలలో హోమ్ స్కూలింగ్ పద్ధతి చట్టవిరుద్ధం.

4. నార్వే -రూ.35,22,943.1058

నార్వేలోని ఉన్నత పాఠశాల టీచర్లు చాలా ఎక్కువ జీతం సంపాదిస్తారు. అక్కడ టీచర్ జీతం పూర్తిగా అనుభవం, నైపుణ్యాలు, జెండర్‌ లేదా పొజిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది టీచర్ల అనుభవ స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అనుభవం జీతంలో ఎక్కువ వేతనాన్ని ఇస్తుంది.

5. డెన్మార్క్ -రూ.34,83,544.8306

ఇతర వృత్తులతో పోలిస్తే డెన్మార్క్‌లో ఒక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడి సగటు జీతం ఎక్కువ. ఇక్కడ ఒక టీచర్‌ హైస్కూల్ టీచర్ కావడానికి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. టీచింగ్, ఎడ్యుకేషనల్ కెరీర్ల నుంచి ఉద్యోగుల జీతభత్యాలు చాలా భిన్నంగా ఉంటాయి. విద్యారంగంలో ఉపాధ్యాయుడికి ఉన్న సంవత్సరాల అనుభవం ఆధారంగా వేతన శాతం పెంపు ఉంటుంది.

మరి మన ఇండియా సంగతేంటి? :
నివేదికల ప్రకారం ఇండియాలో సగటున హైస్కూల్ టీచర్ సంపాదించే జీతం ఏడాదికి రూ.3లక్షల రూపాయలు. ఇది మిగిలిన దేశాలతో పోల్చితే చాలా తక్కువ. లక్సెంబర్డ్‌లో నెలకే దాదాపుగా 5లక్షల రూపాయలను పొందుతారు టీచర్లు.

ALSO READ: నగరం అంతటా కుంభవృష్టి..బయటకు రాలేకపోతున్న ప్రజలు!

#happy-teachers-day-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి