Warangal: వరంగల్‌ లో టెన్షన్‌..టెన్షన్‌..అక్రమ నిర్మాణాల పై GWMC అధికారులు కొరడా!

వరంగల్‌ చౌరస్తాలోని నిబంధనలకు విరుద్దంగా అక్రమ నిర్మాణాలు చేపట్టి.. వర్ణం షాపింగ్‌ మాల్‌ నిర్వహిస్తున్న భవనం పై బల్డియా అధికారులు మంగళవారం తెల్లవారుజామున కొరడా ఝళిపించారు.

Warangal: వరంగల్‌ లో టెన్షన్‌..టెన్షన్‌..అక్రమ నిర్మాణాల పై GWMC అధికారులు కొరడా!
New Update

Warangal: వరంగల్‌ నగరంలో టెన్షన్‌ టెన్షన్‌ వాతావరణం నెలకొంది. వరంగల్‌ చౌరస్తాలోని నిబంధనలకు విరుద్దంగా అక్రమ నిర్మాణాలు చేపట్టి.. వర్ణం షాపింగ్‌ మాల్‌ నిర్వహిస్తున్న భవనం పై బల్డియా అధికారులు మంగళవారం తెల్లవారుజామున కొరడా ఝళిపించారు.

ఇప్పటి వరకూ భవన నిర్మాణానికి సంబంధించిన ఆక్యూపెన్సి సర్టిఫికేట్ తీసుకోకుండా కమర్షియల్ భవనం నిర్మించి వాణిజ్య కార్య కలాపాలు నిర్వహిస్తూ ప్రభుత్వ రోడ్డు స్థలాన్ని అక్రమించుకొని దర్జాగా కబ్జా చేశారు.

గ్రేటర్ వరంగల్ లో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ ల అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూల్చి వేసే దాకా వేచి చూడొద్దని సిటీ ప్లానర్ బానోతు వెంకన్న హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే... ఏ ఒక్కరిని ఊపెక్షించమని హెచ్చరించారు.

పలు షాపింగ్ మాల్స్ లలో స్టిల్ట్ కొరకు నిర్మించిన దానిలో పార్కింగ్ కు కాకుండా... నిర్మాణాలు ఉన్నట్లైతే.. వెంటనే తొలగించుకోవాలని తమ బృందం వచ్చి కూల్చే అవకాశం ఇవ్వొద్దని హెచ్చరించారు.

Also read: మారుతున్న వాతావరణంలో మీ గుండె పదిలమేనా!

#warangal #varnam-shopping-mall #corporation
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి