Rahul Gandhi : లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్షానికి నాయకత్వం వహించనున్నారు రాహుల్ గాంధీ. ఈ మేరకు కూటమి నిర్ణయాన్ని సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రకటించారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్‌కు లేఖ ద్వారా పంపినట్లు కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ నేత విపక్ష నేతగా రాహుల్ గాంధీ పార్లమెంటులో కూర్చోబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 99 స్థానాలు రావడంతో ప్రతిపక్షహోదా దక్కింది. 2014లో 42, 2019లో 55 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది.
అంతకు ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఇంట్లో ఇండియా కూటమి నేతలంతా సమావేశమయ్యారు. ఇందులో రాహుల్‌ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడంతో పాటూ స్పీకర్ ఎన్నిక మీద కూడా చర్చించారు.
National : లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమిస్తూ కీలక ప్రకటన చేసింది కాంగ్రెస్. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ నేత విపక్ష నేతగా రాహుల్ గాంధీ పార్లమెంటులో కూర్చోబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 99 స్థానాలు రావడంతో ప్రతిపక్షహోదా దక్కింది.
Translate this News: