CM Revanth Reddy: నిబంధనలు సడలించి చనిపోయిన కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం.. మానవతా దృక్పథం చాటిన సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి మారోసారి మానవతా దృక్పథాన్ని చాటారు. చనిపోయిన కానిస్టేబుల్ భార్యకు నిబంధనలు సడలించి ఉద్యోగం లభించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండేళ్లుగా స్థానికత కారణంగా ఉద్యోగం దక్కక బాధపడుతున్న ఆ మహిళకు ఈ రోజు రాచకొండ సీపీ నియామక పత్రం అందించారు.

CM Revanth Reddy: నిబంధనలు సడలించి చనిపోయిన కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం.. మానవతా దృక్పథం చాటిన సీఎం రేవంత్
New Update

రాచకొండ పోలీసు కమిషనరేట్ (Rachakonda Police) పరిధిలోని అంబర్ పేట పోలీసు హెడ్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వస్తిస్తున్న సొంగా శేఖర్ 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అతని భార్య సత్యలత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడంతో రెండేళ్లుగా ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి గత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో బాధితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Telangana CM Revanth Reddy) కలిసి తమ కుటుంబ దీనస్థితిని వివరించారు. తమకు ఉద్యోగం ఇప్పించాలని కోరారు. స్పందించిన ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ, రాచకొండ సీపీకి ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Praja Palana: నడిరోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తులు.. రేవంత్ సర్కార్ సీరియస్.. ఆ అధికారులపై వేటు!

publive-image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం డీజీపీ చనిపోయిన కానిస్టేబుల్ భార్యకు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వాలని రాచకొండ కమిషన్ కు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు రాచకొండ సీపీ సత్యలతను జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ నియామక పత్రం అందించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ఉద్యోగం ఇచ్చిందని సత్యలతకు తెలిపారు. సమర్ధవంతంగా నీతి, నిజాయితీతో పనిచేయాలని సూచించారు.
publive-image

భవిష్యత్తులో కూడా మీ కుటుంబానికి అండగా ఉంటామని కమిషనర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డీజీపీ, రాచకొండ పోలీస్ కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రా రెడ్డి, దివంగత కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

#telangana-police-constable #police #cm-revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి