Alleti Maheshwar Reddy: రాష్ట్రం అప్పుల్లో ఉంటే.. మేఘా జేబులు నింపుతున్న రేవంత్! అవినీతిమయమైన మేఘా సంస్థ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం రేవంత్ ను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులు కూలుతున్నా.. అదే సంస్థను ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మేఘా జేబులు నింపడం కోసమే రేవంత్ పని చేస్తున్నారని ఆరోపించారు. By srinivas 12 Aug 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి Telangana: ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముప్పులో ఉంటే మరోవైపు సీఎం రేవంత్ ఆస్థాన గుత్తేదారుల జేబులు నింపేందుకు ప్రయత్నిస్తున్నాని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆరోపించారు. స్వయంగా రేవంత్ ఆరోపించిన సంస్థల మీద విజిలెన్స్ ఎందుకు వేయడం లేదని, కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాదు సుంకిషాల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. ఇది గత ప్రభుత్వ తప్పిదం అయితే ఎంక్వైరీ ఎందుకు వేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే కాంట్రాక్టర్ ను ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు.. కృంగిన, కూలిన మేఘా మీద చర్యలు తీసుకోకుండా అదే కాంట్రాక్టర్ ను ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఏలేటి మహేశ్వర రెడ్డి. గతంలో తాము కోరిన విధంగానే మేఘా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు. మేఘా మీద ఎందుకు మాట్లాడట్లేదని, మొన్నటి ఎన్నికల్లో మెఘా నుంచి మీకు ఫండ్స్ వచ్చాయి. వచ్చే రాష్ట్రాల ఎన్నికల నిధుల కోసం మెఘాతో ఒప్పందం చేసుకున్నారు. అందుకే మేఘాపై చర్యలు లేవు. గత ప్రభుత్వాలు ఇలాగే కాంట్రాక్టర్ల గురించి అలోచించి ఉంటే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్ ఉండేవా? లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ మెఘాకు ఇచ్చి.. నాణ్యత లేని పనులు ఎందుకు చేపిస్తున్నారని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే మేఘాను వెనుక వేసుకొస్తున్నారని మండిపడ్డారు. నాణ్యత లేని పనులు చేసిన ప్రాజెక్ట్స్ మీద ఎంక్వైరీ చేయాలి. మేఘా బ్లాక్ లిస్ట్ లో పెట్టి నాణ్యత లేని ప్రాజెక్ట్స్ తిరిగి వారి డబ్బుతోనే పునరునిర్మించాలని డిమాండ్ చేశారు. కొండగల్ అభివృద్ధి పనులు మేఘాకే.. ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థకు కొత్త పనులు ఇవ్వడం వెనకున్న మతలబు ఏమిటో చెప్పాలన్నారు. కొండగల్ అభివృద్ధి పనులు మేఘాకే ఇచ్చినట్లు తనకు సమాచారం అందిందని తెలిపారు. దీనికి డీపీఆర్ లేదు. ఎన్విరోమెంట్, CWC clearence లేదు. ఏవి లేకుండా మేఘాకు కాంట్రాక్ట్స్ ఎలా ఇస్తారన్నారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేదో తెలియట్లేదన్నారు. కేరళలో నిర్మించిన ఒక ప్రాజెక్ట్ కు సంబంధించి మేఘాకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మేఘాకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. డిజైన్, వర్క్ లోపం ఉందని ఆ లేఖలో పేర్కొన్నాయి. మేఘాకు కేంద్రం ఇచ్చిన నోటీసులు మీడియాకు ఇస్తున్నా. కేంద్రం షోకాజ్ నోటీసు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు షోకాజ్ నోటీసు ఎందుకు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: TG Govt Schemes: రేవంత్ సంచలన నిర్ణయం.. ఆ పథకాల్లో కీలక మార్పులు! అలాగే మేఘా నాణ్యత లేని పనులు చేస్తే దీనిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా? గత పదేళ్ళలో తెలంగాణలో మేఘా 56 ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ చేస్తే ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేదన్నారు. మళ్ళీ 16న ప్రెస్ మీట్ పెట్టి మేఘా అవినీతి విషయాలు బయట పెడతానన్నారు. మేఘా అక్రమాలపై హైకోర్టు, అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్తానన్నారు. #alleti-maheshwar-reddy #megha-engineering-scam #cm-revanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి