Devara Movie:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటూ దేవర సినిమాకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా స్పెషల్ అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో 29 థియేటర్లలో సినిమా విడుదల అవనుంది. మొదటిరోజు అర్ధరాత్రి 1 గంటకు స్పెషల్ షో, దాంతోపాటు అన్ని థియేటర్లలో 6 షోలు ప్రదర్శించేందుకు వెసులుబాటు కల్పించింది. దీని ప్రకారం ఉదయం నాలుగు గంటల నుంచే షోలు ప్రారంభం అవుతాయి. అలాగే స్పెషల్ షోలకు టికెట్ ధర రూ.100 పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.25, మల్టీప్లెక్స్‌ల్లో రూ.50 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా అక్కడి ప్రభుత్వం తొలిరోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు పర్మిషన్ ఇచ్చింది. 28వ తేదీ నుంచి ఐదు ఆటలను వేసుకోవచ్నని చెప్పింది. అలాగే టికెట్ ధరలను సైతం పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్స్‌లో జీఎస్టీతో కలిసి అప్పర్ క్లాస్ రూ.110, లోయర్ క్లాస్ రూ.60, మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో రూ.135 వరకూ పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది.
కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీయార్, జాన్వీకపూర్‌లు హీరోహీరోయిన్లగా నటించిన మూవీ దేవర. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాలో తారక్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 27న దేవర సినిమా విడుదల కానుంది. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు.
Also Raed: కమ్యూనిస్ట్ నాయుకుడి నుంచి అధ్యక్షుడి వరకూ..ఎవరీ కుమార దిసనాయకే