జబర్దస్త్ పాపులర్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా స్వీయ నిర్మాణంలో తెరకెకెక్కిన లేటెస్ట్ ఫిల్మ్ 'కేశవ చంద్ర రామావత్'. బంజారా యువకుడి జీవిత కథ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి అంజి దర్శకత్వం వహించారు. ఇందులో ఫీమేల్ లీడ్ గా యంగ్ బ్యూటీ అనన్యకృష్ణన్ నటించింది.
ఈ చిత్రం నవంబర్ 22న విడుదలైంది. రిలీజ్ కు ముందు రాకేష్ సినిమా కోసం ప్రమోషన్స్ భారీగానే చేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావ్ తో పాటూ జబర్దస్త్ టీమ్ మొత్తాన్ని దించాడు. అందులో మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారు. వీళ్లంతా తమ వంతుగా సినిమాను ప్రమోట్ చేశారు.
ఇది కూడా చదవండి: చలికాలంలో పొడిబారిన చర్మ సమస్య ఇలా పోతుంది
ఇది కూడా చదవండి: నకిలీ RTO ఘరానా మోసం.. ఈ ట్విస్టు ఊహించడం కష్టమే భయ్యా!
రాకేష్ కన్నీటి పర్యంతం..
దీంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షోను ఆడియన్స్ తో కలిసి వీక్షించిన రాకేష్.. సినిమా చూసి ఎమోషనల్ అయ్యాడు. కనీళ్ళు పెట్టుకున్నాడు. రాకేష్ తో పాటూ అతని భార్య సుజాత సైతం కన్నీటి పర్యంతం అయింది.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో పొలిటికల్ మర్డర్.. వైసీపీ నేతను గొడ్డలితో నరికి..!
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రాకింగ్ రాకేష్ జబర్దస్త్ షో ద్వారా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత తన కామెడీ స్కిట్లతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 'KCR' మూవీతో ఒకేసారి హీరోగా, నిర్మాతగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో 13 నర్సింగ్ కాలేజీలకు అనుమతి