టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో దాదాపు నెలరోజుల పాటు జైల్లో ఉండి.. ఇటీవలే అక్టోబర్ 24న బెయిల్ పై బయటకి వచ్చాడు. అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఫిర్యాదుదారు పిటీషన్ దాఖలు చేయగా.. శుక్రవారం సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి విచారణ జరిగింది.
జానీ మాస్టర్ కు భారీ ఊరట..
విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషను డిస్మిస్ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో జానీ మాస్టర్ కు భారీ ఊరట లభించింది. కాగా జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ అతడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: సుక్మాలో భారీ ఎన్ కౌంటర్.. సంబరాల్లో మునిగితేలిన పోలీసులు
2017లో తనను అత్యాచారం చేశాడని.. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా షూటింగ్ కోసం వేరే ప్రాంతాలకు వెళితే అక్కడ కూడా తనపై లైంగిక దాడి చేసినట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం తన వయసు 21 ఏళ్లు అని చెప్పిన ఆమె.. తాను మైనర్‌గా ఉన్నపుడే తనపై దాడి చేశాడని పేర్కొంది. దీంతో పోలీసులు జానీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Allergy: ఇంటి చిట్కాలతో అలెర్జీని సులభంగా పోగొట్టుకోండి