Chhannulal Mishra: పద్మవిభూషణ్ గ్రహీత స్టార్ సింగర్ కన్నుమూత

ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ ఛన్నులాల్ మిశ్రా కన్నుమూశారు. ఆయన 91 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. బనారస్ ఘరానాకు చెందిన మిశ్రా మృతి సంగీత లోకానికి తీరని లోటు. ఆయనకు 2020లో పద్మ విభూషణ్ కూడా లభించింది.

New Update
BREAKING

BREAKING

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ గాయకుడు పండిట్ చన్నులాల్ మిశ్రా 91 సంవత్సరాల వయసులో గురువారం తెల్లవారుజామున 4:15 గంటలకు కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందారు. తరువాత ఆయన కుమార్తె ఆయనను మీర్జాపూర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లింది. 

Chhannulal Mishra passed away

అక్కడ ఆయన వైద్యుల సంరక్షణలో ఉన్నారు. అనంతరం ఆయన తెల్లవారుజామున మీర్జాపూర్‌లో తుది శ్వాస విడిచారు. చన్నులాల్ మిశ్రా మృతికి సంగీత ప్రపంచం సంతాపం వ్యక్తం చేస్తోంది. వారణాసిలోని మణికర్ణికా ఘాట్‌లో ఈరోజు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పండిట్ చన్నులాల్ మిశ్రా ఖయాల్, తూర్పు తుమ్రీ గానంతో ప్రఖ్యాతిగాంచారు. పండిట్ చన్నులాల్ మిశ్రా ఆగస్టు 3, 1936న ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లా హరిహర్‌పూర్‌లో జన్మించారు. 

ఆయన తన తండ్రి బద్రీ ప్రసాద్ మిశ్రా దగ్గర సంగీత శిక్షణ తీసుకున్నారు. తరువాత కిరణ ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ ఘనీ ఖాన్ నుండి ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్‌లో కఠినమైన శిక్షణ పొందారు. కాగా ఆయన ప్రఖ్యాత తబలా వాద్యకారుడు పండిట్ అనోఖ్లాల్ మిశ్రా అల్లుడు కూడా. పండిట్ చన్నులాల్ తన ప్రత్యేకమైన స్వరంతో తుమ్రీ, పురబ్ అంగ్ సాంగ్‌తో మరింత పేరు సంపాదించుకున్నారు. 

ఆయన మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ‘‘ప్రఖ్యాత శాస్త్రీయ గాయకుడు పండిట్ చన్నులాల్ మిశ్రా జీ మరణం నన్ను తీవ్రంగా బాధించింది. ఆయన తన జీవితాన్ని భారతీయ కళ, సంస్కృతి శ్రేయస్సుకు అంకితం చేశారు. ఆయన శాస్త్రీయ సంగీతాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, ప్రపంచ వేదికపై భారతీయ సంప్రదాయాలను స్థాపించడానికి కూడా అమూల్యమైన కృషి చేశారు. నేను ఎల్లప్పుడూ ఆయన ప్రేమ, ఆశీర్వాదాలను పొందడం నా అదృష్టం. 2014లో వారణాసి స్థానం నుండి ఆయన నన్ను ప్రతిపాదించారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని నరేంద్ర మోడీ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. 

మరోవైపు ఛన్నులాల్ మిశ్రా తన సంగీత ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను సాధించారు. ఆయనకు 2010లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురష్కారాలు లభించాయి. అతను బొంబాయిలోని సుర్ సింగర్ సంసద్ శిరోమణి అవార్డును గెలుచుకున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అవార్డు, బీహార్ సంగీత శిరోమణి అవార్డు, నౌషద్ వంటి అవార్డులు అందుకున్నారు. అతనికి భారత ప్రభుత్వంచే సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది. పండిట్ ఛన్నులాల్ మిశ్రా ప్రకాష్ ఝా 2011 చిత్రం ‘‘రిజర్వేషన్’’లో సాన్స్ అల్బెలీ, కౌన్ సి దోర్ వంటి పాటలు పాడారు.

ఇదిలా ఉంటే కోవిడ్-19 మహమ్మారి సమయంలో పండిట్ చన్నులాల్ వ్యక్తిగత విషాదాన్ని చవిచూశారు. 2021లో ఆయన భార్య మాణిక్ రాణి మిశ్రా, కుమార్తె సంగీత మిశ్రా కోవిడ్-19తో మరణించారు. ఇటీవలి కాలం నుంచి ఆయన ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ చివరికి తుదిస్వాస విడిచారు.

Advertisment
తాజా కథనాలు