FIH Pro League: ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో అర్జెంటీనాను ఓడించిన భారత్!

ఆంట్వెర్ప్ ఒలింపిక్స్‌కు ముందు భారత హాకీ జట్టు ఫామ్‌పై కన్నేసింది.FIH హాకీ ప్రో లీగ్‌లో జట్టు అద్భుతంగా ఆడి థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ సహాయంతో, భారత పురుషుల హాకీ జట్టు ఆదివారం అర్జెంటీనాపై 5-4తో విజయాన్ని నమోదు చేసింది.

New Update
FIH Pro League: ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో అర్జెంటీనాను ఓడించిన భారత్!

India Beat Argentina in FIH Hockey Pro League: ఆంట్వెర్ప్ ఒలింపిక్స్‌కు ముందు భారత హాకీ జట్టు ఫామ్‌పై కన్నేసింది. ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రో లీగ్‌లో ఆ జట్టు అద్భుతంగా ఆడి థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (Harmanpreet Singh) అద్భుత హ్యాట్రిక్ సహాయంతో, భారత పురుషుల హాకీ జట్టు ఆదివారం అర్జెంటీనాపై 5-4తో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. దూకుడుతో కూడిన ఆటతీరుతో భారత్‌కు ఒలింపిక్‌ పతకంపై మరోసారి ఆశలు పెంచింది.

భారత్ (India) తరఫున హర్మన్‌ప్రీత్ (29, 50, 52వ నిమిషంలో)తో పాటు అరిజిత్ సింగ్ హుండాల్ (ఏడో నిమిషం), గుర్జంత్ సింగ్ (18వ నిమిషం) కూడా గోల్స్ చేశారు. అర్జెంటీనా తరఫున ఫెడెరికో మోంజా (3వ నిమిషం), నికోలస్ కీనన్ (24వ నిమిషం), టాడియో మారుచి (54వ నిమిషం), లుకాస్ మార్టినెజ్ (57వ నిమిషం) ఒక్కో గోల్ చేశారు.

Also Read: ఈసారీ ఐపీఎల్ లో ఈ రికార్డులు చెక్కు చెదరలేదు.. కొట్టేవాడే లేడా..

మొదటి క్వార్టర్‌లో ఎక్కువ భాగం బంతిని బారత్ తన ఆధీనంలో ఉంచుకుంది. అర్జెంటీనా (Argentina) మొదటి గోల్ చేసింది.అయితే అరిజిత్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేయడంతో భారత్ వెంటనే సమం చేసింది. భారత్‌కు కూడా పెనాల్టీ కార్నర్ లభించినా దానిని సద్వినియోగం చేసుకోలేక తొలి క్వార్టర్ 1-1తో ముగిసింది.

రెండో క్వార్టర్‌ను భారత్‌ అద్భుతంగా ప్రారంభించింది. గుర్జంత్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేసి జట్టుకు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. దీని తర్వాత భారత డిఫెన్స్ పొరపాటును సద్వినియోగం చేసుకున్న కీనన్ సర్కిల్‌లోకి ప్రవేశించి బంతిని గోల్‌లోకి పంపడంతో స్కోరు 2-2తో నిలిచింది. అయితే, క్వార్టర్ ముగియడానికి ఒక నిమిషం మిగిలి ఉండగానే భారత్ పెనాల్టీ కార్నర్‌ను గెలుచుకుంది.దీంతో హర్మన్‌ప్రీత్ భారత్‌ను 3-2తో ముందంజలో ఉంచాడు.

మూడో క్వార్టర్‌లో ఇరు జట్లు చెలరేగిపోయే ఆటను ప్రదర్శించాయి. హర్మన్‌ప్రీత్ కొట్టిన షాట్‌ను అర్జెంటీనా గోల్‌కీపర్ ఆపడంతో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా దానిని గోల్‌గా మార్చలేకపోయింది. ఇరు జట్ల పటిష్ట డిఫెన్స్ కారణంగా మూడో క్వార్టర్ గోల్ లేకుండానే మిగిలిపోయింది. నాలుగో క్వార్టర్‌లో భారత్‌ మంచి ఫామ్‌లో కనిపించింది. జట్టు అర్జెంటీనాను తప్పులు చేయడానికి బలవంతం చేసింది, దీని కారణంగా మ్యాచ్ ముగియడానికి 10 నిమిషాల ముందు భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది, దానిని పెనాల్టీ స్ట్రోక్‌గా మార్చిన హర్మన్‌ప్రీత్.. గోల్ చేసి భారత్‌కు 4-2 ఆధిక్యాన్ని అందించాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు