RS Praveen Kumar House Arresst:గ్రూప్-2 పరీక్ష (TSPSC Group 2)వాయిదా వేయాలంటూ సత్యాగ్రహ నిరాహార దీక్ష చేస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు చేయడం సరైంది కాదని సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు సంజీవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పరీక్షను వెంటనే వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. దుబ్బాక పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండు వద్ద బీఎస్పీ నాయకులు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. కాసేపు వాహనాలు ఎక్కడివి అక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాస్తారోకో చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హౌస్ అరెస్టుపై బీఎస్పీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2 పరీక్షను వెంటనే వాయిదా వేయాలని సిద్ధిపేట బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ డిమాండ్ చేశారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ సత్యాగ్రహ నిరాహార దీక్ష చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు సరైంది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Translate this News: