Telangana Politics: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు!

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు రాత్రి ప్రకాశ్ గౌడ్, రేపు ఉదయం అరికపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

New Update
Telangana Politics: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు!

బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్‌ కావడానికి సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరేందుకు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. రేపు ఉదయం పది గంటలకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సైతం కాంగ్రెస్ లో చేరునున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఆయన సిద్ధం అవుతున్నట్లు సమాచారం.  ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ గూటికి చేరిపోయారు.

ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు చేరితే ఆ సంఖ్య 9కి చేరుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 64 మంది, బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే.. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.

దీంతో బీఆర్ఎస్ బలం 38కి తగ్గింది. కాంగ్రెస్ బలం 65కు పెరిగింది. ఏడుగురు ఎమ్మెల్యేలు జంప్ కావడంతో బీఆర్ఎస్ బలం 31కి పడిపోయింది. మొత్తం 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలన్నది సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు