Tillu Square OTT : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ మూవీ! సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు కు సీక్వల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ బంపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ అయ్యింది.అయితే టిల్లు స్క్వేర్ ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ఫిక్స్ ఖరారైయింది.అదేప్పుడో చూసేయండి! By Durga Rao 17 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి OTT Update : సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సిద్ధు పదేళ్ల క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. నాగ చైతన్య జోష్ సినిమాతో ఆయన తన సినీ కెరీర్‌ను ప్రారంభించాడు. ఇక ఆ మధ్య డీజే టిల్లు(DJ Tillu) అంటూ వచ్చి బంపర్ హిట్ అందుకున్నాడు సిద్ధూ. ఈ సినిమా ఫిబ్రవరి 12న 2022న విడుదలై మంచి బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. అంతేకాదు అటు ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షల్స్‌ను రాబట్టింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు 2 వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 125 కోట్లు వసూలు చేసి వావ్ అనిపించింది. ఇక అది అలా ఉంటే టిల్లు స్క్వేర్(Tillu Square) మూవీ OTT స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చి 29న విడుదలైన ఈ సినిమా ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్(Netflix) లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుంది. ఈ చిత్రానికి సుమారు 14 కోట్ల వరకు డీల్ కుదిరిందని అంటున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్‌గా చేసింది. రామ్ మిర్యాల, అచ్చు, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.ఇక ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాలో అనుపమ గ్లామర్ రోల్ చేయడం ఓ ఛాలెంజ్ అయితే.. దాన్ని తన మార్క్ నటనతో కేక పెట్టించింది. అందాల ఆరబోతే కాదు.. నటనతోను మెప్పించింది అనుపమ. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సినిమాకు కొనసాగింపుగా టిల్లు 3 కూడా రానుందట. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుంది. Also Read : మిల్క్ షేక్ ల్లో గంజాయి పౌడర్.. పాలు, హార్లిక్స్, బూస్ట్ లో గుర్తించిన హైదరాబాద్ పోలీసులు! #ott #dj-tillu-square #netflix #tollywood-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి