Cantonment Byelection: తెలంగాణలో ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

తెలంగాణలో మే 13న జరిగే కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో నిలిచే ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. డా. టీఎన్ వంశా తిలక్ పేరును ఖరారు చేసింది. కాంగ్రెస్ నుంచి శ్రీగణేష్, బీఆర్ఎస్ నుంచి నివేదిత ఎమ్మెల్యే రేసులో ఉన్నారు.

New Update
Cantonment Byelection: తెలంగాణలో ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

Cantonment BJP MLA Candidate: తెలంగాణలో మే 13న జరిగే కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో నిలిచే ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. డా. టీఎన్ వంశా తిలక్ పేరును ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి శ్రీగణేష్, బీఆర్ఎస్ నుంచి నివేదిత ఎమ్మెల్యే రేసులో ఉన్నారు. కాగా ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడం వల్ల కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే.

గత ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానం..

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత విజయం సాధించింది. ఆనాడు బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ పై 17,169 ఓట్ల మెజారితో లాస్య నందిత విజయం సాధించారు. కాగా కంటోన్మెంట్ లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన గద్దర్ కూతురు వెన్నెల మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో శ్రీగణేష్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో అక్కడ బీజేపీకి సానుకూలంగా ఉన్న ఓటర్లు ఇప్పుడు కాంగ్రెస్ వైపునకు తిరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రానున్న ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ లో ఏ పార్టీ జెండా ఎగరబోతుందో వేచి చూడాలి.

కాంగ్రెస్ నుంచి బీజేపీ నేత..

కాంగ్రెస్(Congress) సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థిగా శ్రీగణేష్ పేరును హైకమాండ్ ప్రకటించింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించిన లాస్య నందిత(Lasya Nanditha) ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident) లో మరణించిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్ ఎన్నికలతోనే ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు