Bizarre: ఈ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే జైలు శిక్ష తప్పదు..! ఆఫ్రికన్ దేశమైన ఎరిట్రియాలో, పురుషులందరూ రెండుసార్లు వివాహం చేసుకోవాల్సిందే. లేదంటే అక్కడ వారికి జైలు శిక్ష విధిస్తారు. ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చట్టం కూడా చేసింది. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించే వారికి జీవిత ఖైదు కూడా విధించవచ్చు. మొదటి భార్య రెండో పెళ్లిని వ్యతిరేకిస్తే ఆమెకు కూడా శిక్ష పడుతుంది. By Shiva.K 12 Oct 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Viral News: ఏ దేశానికి ఆ దేశం స్వంత నియమాలు, చట్టాలు కలిగి ఉంటాయి. ఆయా దేశాల్లో ఆయా కమ్యూనిటీ ప్రజలు నివసిస్తుంటారు. ఎవరి ఆచారాలు, అలవాట్లు వారికి విభిన్నంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో విచిత్రమైన సంప్రదాయం, ఆచారాలు ఉంటాయి. భారతదేశంలో వివిధ కులాలు మరియు మతాల ప్రజలు నివసిస్తున్నారు. కానీ అందరి గురించి మనకు తెలియదు. బయటి ప్రపంచానికి తెలియని అనేక జాతుల వారు దేశ వ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. వివిధ కులాలు, సంప్రదాయాల గురించి చూస్తే.. వారి వారి ఆహారం, జీవనశైలి, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. అంతేకాదు.. వారి నియమాలు, పుట్టుక నుంచి వివాహం, అంత్యక్రియల వరకు విభిన్నంగా ఉంటాయి. అలాంటి విచిత్ర సంప్రదాయం, చట్టాలు ఉన్న దేశం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం.. భారతదేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి ఒక వివాహం మాత్రమే చేసుకోవాలి. అంతకు మించి చేసుకుంటే.. శిక్షార్హులు అవుతారు. కానీ, ఈ దేశంలో మాత్రం పురుషులు రెండు వివాహాలు చేసుకోవాల్సిందే. ఒకవేళ అందుకు అంగీకరించకుంటే.. శిక్ష విధించే ఆస్కారం ఉంది. ఆఫ్రికన్ దేశమైన ఎరిట్రియాలో, పురుషులందరూ రెండుసార్లు వివాహం చేసుకోవాల్సిందే. లేదంటే అక్కడ వారికి జైలు శిక్ష విధిస్తారు. ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చట్టం కూడా చేసింది. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించే వారికి జీవిత ఖైదు కూడా విధించవచ్చు. మొదటి భార్య రెండో పెళ్లిని వ్యతిరేకిస్తే ఆమెకు కూడా శిక్ష పడుతుంది. ఎరిట్రియాలో పురుషుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఈ వింత చట్టం రూపొందించడం జరిగిందట. ఇక్కడ పురుషుల కంటే మహిళల సంఖ్య రెండింతలు ఎక్కువ. అందుకే ఇక్కడ పురుషులు బలవంతంగా రెండు సార్లు పెళ్లి చేసుకుంటారు. ఎరిత్రియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురైంది. ఈ దేశం ప్రపంచంలోని అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటి. అయితే, ఎరిట్రియా మినహా, చాలా దేశాలు వేర్వేరు నియమాలను కలిగి ఉన్నాయి. అదేవిధంగా ఐస్లాండ్లో కూడా అమ్మాయిలకు చాలా ఆకర్షణీయమైన వివాహ ఆఫర్లు ఇస్తారు. ఇక్కడ వివాహాలు చేసుకునే వారు చాలా తక్కువ. దాంతో అక్కడి ప్రభుత్వం వివాహం చేసుకునే వారికి రూ. 3 లక్షల ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది. బయటి వ్యక్తితో స్థానిక అమ్మాయి వివాహం చేసుకుంటే.. వారికి పౌరసత్వం కూడా ఇస్తోంది. Also Read: స్టేడియంలోనే తన్నుకున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఇండియా,అఫ్ఘాన్ మ్యాచ్ సమయంలో ఏం జరిగిందంటే? శ్రీనివాస్ గౌడ్ ఏ కార్డు ప్లే చేసినా.. ఓడిస్తా: యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ #trending-news #marriages-mandatory #refused-marriage #punishment #viral-news #marriages మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి