Bharateeyudu 2 : 'భారతీయుడు 2' ఫస్ట్ డే కలెక్షన్స్.. మరీ ఇంత దారుణమా! 'ఇండియన్ 2' మూవీ తొలిరోజు రూ. 26 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తమిళ్ వర్షన్లో రూ.16 కోట్లు వస్తే, తెలుగులో రూ.8 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. హిందీలో అయితే కేవలం కోటి రూపాయలు మాత్రమే వచ్చినట్లు తెలిసింది. By Anil Kumar 13 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Bharateeyudu 2 Day 1 Collections : యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) – శంకర్ (Director Shankar) కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదని చాలామంది క్రిటిక్స్ సైతం అభిప్రాయపడ్డారు. ఇక సినిమాకు కలెక్షన్స్ కూడా అంతగా రాలేదు. ఇండియన్ 2 (Indian 2) మూవీ తొలిరోజు రూ. 26.1 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళ్ వర్షన్లో రూ. 16 కోట్లు వస్తే.. తెలుగులో రూ. 8 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక హిందీలో అయితే మరీ దారణంగా కలెక్షన్స్ వచ్చాయి. Also Read : బాలీవుడ్ కు వెళ్తున్న’రాజు యాదవ్’.. గెటప్ శ్రీను ప్లేస్ లో స్టార్ హీరోతో రీమేక్? ఇంత దారుణమా? బాలీవుడ్ (Bollywood) లో మొదటిరోజు కేవలం కోటి రూపాయలు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. శంకర్ లాంటి పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ సినిమాకు బాలీవుడ్లో ఇంత తక్కువ కలెక్షన్స్ రావడం గమనార్హం. కమల్ గత చిత్రం 'విక్రమ్' మొదటి రోజే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేయగా.. 'భారతీయుడు 2' దాని దరిదాపుల్లో కూడా వెళ్లలేకపోయింది. #kamal-haasan #bharateeyudu-2-movie #bharateeyudu-2-day-1-collections #director-shankar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి