Diabetic Health: మధుమేహ సమస్య ఉన్నవాళ్లు.. ఈ పండ్లు మాత్రమే తినండి..!

జీవన శైలి వ్యాధుల్లో చాలా మంది ఎక్కువగా మధుమేహ సమస్యతో బాధపడుతుంటారు. మధుమేహ సమస్య ఉన్న వారు ఈ పండ్లు తింటే మంచిది. బెర్రీస్, ఆపిల్, అవకాడో, నారింజ, కివీ పండ్లు వీటిలోని తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ గుణాలు రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించును.

New Update
Diabetic Health:  మధుమేహ సమస్య ఉన్నవాళ్లు.. ఈ పండ్లు మాత్రమే తినండి..!

Diabetic Health: ఈ మధ్య కాలంలో మనం తినే ఆహారపు అలవాట్లులో మార్పుల వల్ల మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు వంటి జీవన శైలీ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. వీటిలో ముఖ్యంగా చాలా మంది మధుమేహం సమస్యతో బాధపడతారు. ఈ మధ్య పెద్ద వాళ్లలో మాత్రమే కాదు చిన్న వయసు వారిలో కూడా ఈ సమస్య తరచుగా కనిపిస్తోంది. మధుమేహం సమస్య ఉన్నవారు.. వాళ్ళు తినే ఆహరం పై ఎంతో శ్రద్ధ వహిస్తారు. కూరగాయలు, పండ్లు లో ఏవి తినాలి.. ఏవి తినకూడదు అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. కొంత మంది ఫ్రూట్స్ అన్నీ తియ్యగా ఉంటాయని.. వాటిలో ఏవి తినాలి అయోమయంలో ఉంటారు. మధుమేహం సమస్య ఉన్న వారు ఈ పండ్లను హాయిగా తినొచ్చు.

బెర్రీస్

స్ట్రాబెర్రీస్, రాస్ప్ బెర్రీస్, బెర్రీస్ వీటిలో యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో తినడం వల్ల వీటిలోని ఫైబర్ శాతం రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించును.

publive-image

ఆపిల్

మధుమేహ సమస్య ఉన్న వాళ్ళు ఆపిల్స్ ను హాయిగా తినొచ్చు. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండును. ఇది రక్తంలోని చక్కెర స్థాయిల పై తక్కువగా ప్రభావం చూపించి.. షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంచును.

publive-image

నారింజ పండ్లు

నారింజ పండ్లు తక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫైబర్ ఉంటాయి. ఈ పండులోని తక్కువ కార్బోహైడ్రేట్స్ రక్తంలోని చక్కర స్థాయిలు పెరగడాన్ని నియంత్రించును. అంతే కాదు దీనిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి.

publive-image

కివి పండ్లు

కివి పండు.. వీటిలో శరీరానికి కావాల్సిన పుష్కలమైన పోషకాలు ఉంటాయి. వీటిలోని తక్కువ గ్లైసెమిక్ వ్యాల్యూ రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించి.. షుగర్ కంట్రోల్ ఉండడానికి సహాయపడును.

publive-image

అవకాడో

మధుమేహ సమస్య ఉన్న వారికి ఇది సరైన ఎంపిక.. వీటిలో తక్కువ కార్బోహైడ్రేట్స్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని డైయాబెటిక్ బాధితులు వారి డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది.

publive-image

  • మధుమేహ సమస్య ఉన్నవారు.. వారి ఆహారంలో ఏదైనా చేర్చుకునేటప్పుడు వైద్య నిపుణుల సలహాలను తప్పని సరిగా తీసుకోవాలి.

Also Read: Health: గ్రీన్ బీన్స్ చేసే మేలు తెలుసుకుంటే తినకుండా ఉండలేరు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు