Parenting: పిల్లలు చిన్నవయసు వచ్చే వరకు మంచంపై మూత్ర విసర్జన ఒక సాధారణ పద్ధతిగా పరిగణిస్తారు. మరోవైపు, పిల్లవాడు సరైన వయస్సుకు వచ్చిన తర్వాత కూడా మంచం తడిస్తే, అది కొంతమంది తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. చాలామంది పిల్లలు యుక్తవయస్సులోనూ ఈ అలవాటుతో బాధపడవచ్చు. నిజానికి ఈ అలవాటు పిల్లల ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. ఈ అలవాటు వారి పిల్లల మనస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి పిల్లల మంచం తడిపే అలవాటును నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో సరైన వైద్యం చేయించాలి. అదే సమయంలో, చాలా మంది తల్లిదండ్రులు దీనిని ఇబ్బందికరమైన అంశంగా దాచకూడదు.
ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది?
- మంచం తడిపే ఈ అలవాటు 6-15 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. చాలా మంది పిల్లలు ఈ అలవాటుకు సిగ్గుపడతారు. అటు ఈ అలవాటు క్రమంగా దూరమైతే పర్వాలేదు. లేకపోతే ఇది పిల్లల పురోగతిని కూడా నెగిటివ్‌గా ప్రభావితం చేస్తుంది.
ఇలా ఎందుకు తడుపుతారు?
- ఇది మెదడు- మూత్రాశయం మధ్య ప్రక్రియ. తల్లి లేదా మరొకరు 3 నుంచి 5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు టాయిలెట్ శిక్షణ ఇచ్చినప్పుడు, పగటిపూట ఈ అలవాటును అలవర్చుకుంటారు. కానీ రాత్రి గాఢ నిద్రలో అలా జరగదు. మెదడు -మూత్రాశయం ఒకదానితో ఒకటి ఇంటరెక్ట్ అవ్వవు. చిన్నవయసులో ఈ రెండిటి మధ్య సమన్వయం ఉండదు.
పరిష్కారం ఏంటి?
1. పిల్లలకు టీ, కాఫీ, బేకరీ ఉత్పత్తులు, జంక్ ఫుడ్, స్వీట్లు ఇవ్వకూడదు.
2. సాయంత్రం తర్వాత పిల్లలకు ఫ్లూయిడ్స్ తక్కువగా ఇవ్వండి.
3. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బాత్రూంకు వెళ్లడాన్ని అలవాటు చేయాలి.
పెద్దయిన తర్వాత కూడా ఇలానే మంచాన్ని యూరిన్‌తో తడుపుతుంటే డాక్టర్‌ను సంప్రదించాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఏంటి? రోజూ ఎలా ఉండాలి?